Breaking News

పిజి కోర్సులు తిరిగి ప్రవేశపెట్టడం పట్ల టిజివిపి హర్షం

కామారెడ్డి, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ, పిజి కళాశాలలో ఈ (2019-2020) విద్యా సంవత్సరం నుండి పీజీ (ఎంఎస్‌డబ్ల్యు, ఎంకాం, ఎంఎ ఎకనామిక్స్‌, ఎంఎ తెలుగు) నాలుగు పీజీ కోర్సులు ఎత్తివేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి నోటీసు పంపింది. ఈ విషయమై టీజీవిపి స్పందించి కోర్సులు యధావిధిగా నడపాలని స్థానిక కలెక్టర్‌ సత్యనారాయణకు, ఉన్నతాధికారులకు విన్నవించగా నూతనంగా వచ్చిన కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రకాంత్‌, ఉన్నతాధికారుల సహకారంతో నాలుగు పీజీ కోర్సులు మరల ప్రవేశ పెట్టడం పట్ల టీజీవిపి హర్షం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌కు, అధ్యాపక బందానికి మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఉన్నతాధికారులకు టీజీవిపి ధన్యవాదాలు తెలిపింది. అదే విదంగా కళాశాల అభివద్ధి కొరకు, విద్యార్థుల సంక్షేమం కొరకు టిజివిపి ముందుంటుందని చెప్పారు.

అలాగే ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలకు అన్ని వసతులు ఉన్నాయని (లైబ్రరీ సైన్స్‌, జర్నలిజం) కొత్త కోర్సులు ప్రవేశ పెడితే ఇక్కడి విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులో ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో టిజివిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్‌, నాయకులు ఇసాయిపేట్‌ నరేష్‌, అల్లూరి, ప్రకాష్‌, భూపాల్‌, సిద్దూ, నితిన్‌ కుమార్‌లు ఉన్నారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *