Breaking News

Daily Archives: August 15, 2019

రెప రెప లాడిన జాతీయ జెండా

నందిపేట్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా రెప రెప లాడింది. తహశీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అలివేలు, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ రాఘవేందర్‌, మండల పరిషత్‌ కార్యాలయంపై ఎంపిపి వాకిడి సంతోష్‌ రెడ్డి, వ్యవసాయ కార్యాలయంపై సాయి కష్ణ, విద్యా వనరుల కేంద్రం వద్ద ఎంఇఓ శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ వైద్య శాల వద్ద డాక్టర్‌ విజయ భాస్కర్‌ రావు, పశు వైద్య శాలలో డాక్టర్‌ హన్మంత్‌ రెడ్డి, నందిపేట ...

Read More »

ఆర్మూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆర్మూర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డుకాలనీలో గురువారం అంగన్‌ వాడి పాఠశాల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకురాలు లత జాతీయ జెండా ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్‌ మండలంలోని తహసీల్‌ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోదుల జీవిత చరిత్రలను గుర్తుచేశారు. కార్యక్రమంలో ఉప తహశ్ఱిల్దార్‌ రాజశేఖర్‌, రెవిన్యూ ...

Read More »

సోదర భావానికి ప్రతీక రక్షాబంధన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో గురువారం రక్షాబందన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాదు న్యాల్‌కల్‌ రోడ్డు లోని ఏపి ఫొరం మానసిక వికలాంగుల పాఠశాలలో రక్షాబందన్‌ సందర్భంగా లయన్స్‌ సభ్యులు విద్యార్థులకు రాఖీలు కట్టారు. మానసిక వికలాంగ విద్యార్థినిలచే లయన్స్‌ సభ్యులు రాఖీలు కట్టించుకొని మిఠాయిలు, పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్‌ మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి సోదర భావానికి ప్రతీక రక్షాబందన్‌ అని ...

Read More »

భవిష్యత్‌ పోరాటాలకు సిద్దం కావాలి

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 72 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏఐటియుసి ఆద్వర్యంలో గురువారం త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై భవిష్యత్‌ పోరాటానికి సన్నద్ధం చేసేందుకు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, నర్సింగ్‌ రావు, సలీం, గంగాధర్‌, రఘు, జలీల్‌, సంపత్‌, పాషా కార్మికులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

రెంజల్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆయా పాఠశాలల విద్యార్థులు వాడవాడలా ర్యాలీలు నిర్వహించి పలు ప్రధాన కూడళ్ల వద్ద జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ జెండా ఎగరవేశారు. తహసిల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ లోలపు రజినీ, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై శంకర్‌ జెండా ఎగరవేశారు. గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌లు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీ ...

Read More »

నోటుపుస్తకాల పంపిణీ

రెంజల్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మండల తహసీల్దార్‌ కార్యాలయంలో జాతీయ గీతాన్ని ఆలపించిన విద్యార్ధులకు తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ నోట్‌ బుక్కులు, పెన్నులను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ గంగాసాగర్‌, ఆర్‌ఐ గంగాధర్‌ రావు, వీఆర్వోలు, సంతోష్‌, భూమన్న, రాములు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Read More »

ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రం

రెంజల్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా ఉత్తమ సేవలు అందించిన శోభన్‌కు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ రామ్మోహన్‌రావు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. రెంజల్‌ మండల కేంద్రంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా నియమితులై అనతి కాలంలోనే ఉపాధి హామీ కూలీల ప్రశంసలు అందుకున్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పిస్తూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అధికారులు గుర్తించి మండల ఉత్తమ ఫీల్డ్‌ ...

Read More »

ఘనంగా సంతోషిమాత పుట్టినరోజు వేడుకలు

బాన్సువాడ, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం బాన్సువాడ సంతోషిమాత ఆలయంలో సంతోషిమాత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయమే గణపతి హోమము, అమ్మవారికి అభిషేకాలు, డోలారోహణ ప్రత్యేక పూజలు చేపట్టారు. సంతోషిమాత పల్లకి సేవ, ఊరేగింపు కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగాయి. పురోహితులు భాస్కర్‌ శర్మ, చంద్రశేఖర శర్మ, సంతోషి మాత ఆలయ అర్చకులు శ్రీనివాస రావు, ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు, గురు స్వాములు స్వాములు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

Read More »

శాసనసభ ఆవరణలో పతాకావిష్కరణ

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆవరణలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిద్దిపేట శాసనసభ్యులు టి.హరీష్‌ రావు, అసెంబ్లీ కార్యదర్శి డా.నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

అన్నదాన సత్రం కార్యదర్శిగా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు చాట్ల రాజేశ్వర్‌ బాసర అన్నదాన సత్రం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం వారు ఘనంగా సన్మానించారు. పట్టణ అధ్యక్షుడు షేర్ల లక్ష్మణ్‌, కార్యదర్శి సబ్బని కష్ణ హరి, శిలసాగర్‌, సబ్బని శంకర్‌, క్యాతం దూసా వెంకటస్వామి, సిద్ధిరాములు, పడిగే రాములు, జిల్లా వర్కింగ్‌ సెక్రటరీ బొమ్మ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాట్ల రాజేశ్వర్‌ మాట్లాడుతూ తనపై ...

Read More »

స్వతంత్ర స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాద పరిషత్‌ ఆధ్వర్యంలో స్థానిక సరస్వతి నగర్‌లోని కార్యాలయం వద్ద పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్‌ గౌడ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశభక్తితో స్వతంత్ర స్ఫూర్తితో విద్యార్థులు యువకులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాది పరిషత్‌ నాయకులు ఉదయ్‌ కష్ణ, ఎర్రం విగ్నేష్‌, బంటు వసంత్‌, దిలీప్‌, కే.శ్రీనివాస్‌, దయాకర్‌ గౌడ్‌, రాజు, గోవర్ధన్‌, బిట్ల రవి, బాల్‌ రాజ్‌ నాయక్‌, దయాకర్‌ గౌడ్‌, ...

Read More »