Breaking News

సోదర భావానికి ప్రతీక రక్షాబంధన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో గురువారం రక్షాబందన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాదు న్యాల్‌కల్‌ రోడ్డు లోని ఏపి ఫొరం మానసిక వికలాంగుల పాఠశాలలో రక్షాబందన్‌ సందర్భంగా లయన్స్‌ సభ్యులు విద్యార్థులకు రాఖీలు కట్టారు. మానసిక వికలాంగ విద్యార్థినిలచే లయన్స్‌ సభ్యులు రాఖీలు కట్టించుకొని మిఠాయిలు, పండ్లు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్‌ మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి సోదర భావానికి ప్రతీక రక్షాబందన్‌ అని పేర్కొన్నారు. అంతకు ముందు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో లక్ష్మినారాయణ జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఏపి ఫోరం మానసిక వికలాంగుల పాఠశాల కరస్పాండెంట్‌ రమేష్‌, లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి చింతల గంగాదాస్‌, కోశాధికారి సిలివేరి గణేష్‌, ప్రోగ్రామ్‌ చైర్మెన్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *