కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ముప్పవరపు ఆనంద గుప్తా ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు, ప్రముఖులచే హరితహారం కార్యక్రమాన్ని కామారెడ్డి ఇందిర నగర్ లోని (స్మశనం) వైకుంఠ ధామంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో కార్యదర్శి మురికి శ్రీనివాస్ గుప్తా, ఆర్గనైజింగ్ సెక్రటరీ నూకల ఉదయ్ గుప్త, కోశాధికారి విశ్వనాథుల రాజేంద్ర గుప్తా, అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ గరిపల్లి శ్రీధర్ గుప్తా, ఉపాధ్యక్షులు గౌరిశెట్టి గుణెంధర్ గుప్తా, పిఆర్వో ...
Read More »Daily Archives: August 16, 2019
హరితహారంలో నాటిన ప్రతి మొక్కను బతికించాలి
కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీ రాజ్ యాక్ట్ ద్వారా హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడం, వాటి సంరక్షణ పట్ల సర్పంచ్‌లకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నుస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లి విత్తన ఉత్పత్తి క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. క్షేత్రంలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పరిశీలించారు. భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ రైతులే నిర్వహించేలా చర్యలు తీసుకొని సబ్సిడీ అందించడం జరుగుతుందని తెలిపారు. ...
Read More »అజాత శత్రువు అటల్జీ
కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రదాని, భారత రత్న అటల్ బిహారీ వాజపేయి మొదటి వర్ధంతి సందర్బంగా కామారెడ్డి పట్టణంలోని వద్ధాశ్రమంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వద్దాశ్రమం లోని వద్దులకు పండ్ల పంపిణి చేసి, యాజమాన్యానికి బియ్యం, వంట సామగ్రి అందజేశారు. ఈ సందర్బంగా అసెంబ్లీ కన్వీనర్ తేలు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మేరు శిఖరం, బిజెపి కార్యకర్తలకు మార్గదర్శి అటల్జీ ...
Read More »సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయం
నిజామాబాద్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సబ్బండ వర్గాల అభివ ద్దే ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాల, రవాణా, శాసనసభ వ్యవహారాల గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎస్సారెస్పీ ప్రాజెక్టులో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావుతో కలిసి మంత్రి చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సంక్షేమం, అభివద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటివని, చరిత్ర తిరిగి రాసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెచ్చుకున్న ...
Read More »రక్తనిది కేంద్రభవనాన్ని ప్రారంభించిన స్పీకర్
బాన్సువాడ, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో రక్తనిది కేంద్ర భవనాన్ని తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Read More »వివాహిత ఆత్మహత్య
ఆర్మూర్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్మూర్ పట్టణంలోని మామిడిపల్లికి చెందిన గోలి వాణి (28) అనే వివాహిత శుక్రవారం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసింది. కాగా గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Read More »మాజీ కౌన్సిలర్‌కు సన్మానం
ఆర్మూర్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో గల చండీమాత ఆలయ వీధిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టిన మాజీ కౌన్సిలర్ రామ్ మోహన్‌ను ఎంబిసి జిల్లా అధ్యక్షుడు మఠం విజయ్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీధిలో సిసి రోడ్లు లేక గత నాలుగు సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కషిచేసిన మాజీ కౌన్సిలర్ రామ్ మోహన్‌ను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో వార్డు వాసులు రమేష్, ...
Read More »పడకేసిన పారిశుధ్యం
నందిపేట్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేటలోని 3వ వార్డు బర్కత్‌పురలో సమస్యలు తిష్టవేశాయి. బర్కత్‌పుర కాలనీ పారిశుద్యం పడకేసింది. ఎక్కడ చూసినా అధ్వాన్నమైన మురికి కాలువలు దర్శనమిస్తున్నాయి. మురికి కాలువల్లో పందులు, దోమలు స్వైర విహారం చేస్తుండడంతో వ్యాధులు సోకుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో సమస్యల గురించి పంచాయతీ అదికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. బర్కత్‌పురలో డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేక పోవడం, మురికి నీరు ఖాళీ ప్లాట్లలో ఆగి చుట్టు ...
Read More »సిబ్బంది రెగ్యులర్‌గా విధులకు హాజరు కావాలి
నిజామాబాద్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కిసాన్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హాజరు రిజిస్టర్ పరిశీలించగా ప్రధాన వైద్యాధికారి, స్టాఫ్ నర్స్ గైర్హాజర్ కాగా వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫోన్ చేసి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఫార్మసిస్ట్ వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్న మందుల వివరాలు తెలుసుకున్నారు. అవుట్ పేషంట్ వద్దకు స్వయంగా ...
Read More »