నిజామాబాద్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జంతు కళేబరాల సమగ్ర విచారణ చేసి వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. శనివారం చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జంతు కళేబరాలను కుప్పగా పోసిన విషయాలను అధికారుల దష్టికి తీసుకువస్తూ ఈ విషయమై రవాణా, అటవీ, పశుసంవర్ధక, మున్సిపల్, జిల్లా పంచాయతీ, అధికారులు పూర్తి వివరాలను సేకరించాలని అన్నారు. కళేబరాలు ఎక్కడినుండి వస్తున్నాయి, వీటిని దేనిగురించి తీసుకువచ్చారో ...
Read More »Daily Archives: August 17, 2019
గ్రామ రెవెన్యూ అధికారి సస్పెండ్
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లంచం డిమాండ్ చేసి వసూలు చేయడం, విధుల పట్ల నిర్లక్ష్య ప్రవర్తన, తదితర ఆరోపణలపై మాచారెడ్డి మండలం బండ రామేశ్వరంపల్లి గ్రామ రెవెన్యూ అధికారి సూర్యవర్ధన్ను ఈనెల 14వ తేదీ బుధవారం నాడు విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. మాచారెడ్డి మండలం బండ రామేశ్వరంపల్లి గ్రామస్థుడు సినిగిరి యాదయ్య తన తల్లి సినిగిరి శ్రీలక్ష్మి కొత్త పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు ...
Read More »రైల్వే బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేయండి
నిజామాబాద్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు రైల్వే అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల అభివద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్రిడ్జి నిర్మాణం గత సంవత్సరం నవంబర్ వరకు పూర్తి కావాల్సి ఉందని అయితే ఇంకా పూర్తి కాకపోవడానికి కారణాలు ఏమిటని అధికారులను అడిగారు. ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా ఆరు ...
Read More »సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో 2005 సమాచార హక్కు చట్టంపై అవగహన సదస్సు నిర్వహించారు. ఎంపిపిఓ మల్లికార్జున్ రెడ్డి, ఎంఆర్ఓ రామేశ్వర్ రావు, ఏపీఎం చామంతి చేతులమీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజల చేతుల్లో వజ్రాయుధమని, దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గురించి అఖిల భారతీయ ప్రజా సేవ సమితి సమాచార హక్కు రాష్ట్ర ...
Read More »ఆర్టికల్ 370 రద్దును నిరసిస్తూ ధర్నా
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ప్రభుత్వం ఆఘమేఘాలపై 370 యాక్టు రద్దుచేసి జమ్మూ కాశ్మీర్‌లోని హిందూ ముస్లిం ప్రజల మధ్య వైషమ్యాలు స్రుష్టించి అందాల కాశ్మీర్ రాష్ట్రం ముక్కలుగా చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఎంసిపిఐయూ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డిఓకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ విదేశీ సామ్రాజ్యవాద శక్తులకు, విదేశీ కార్పొరేట్ ...
Read More »శరవేగంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం
బాన్సువాడ, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ఎస్సి కాలనీలో నూతనంగా నిర్మించిన 40 రెండు పడక గదుల ఇళ్లను శనివారం రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించి, లబ్ధిదారుల ఇళ్ళలో పాలు పొంగించి గహప్రవేశం చేయించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం సాగుతోందని, ఇళ్ళు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని స్పీకర్ అన్నారు. వంద ...
Read More »ఉద్యోగాల కోసం శిక్షణ
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఎస్ఆర్ఎం గార్డెన్స్, బీబీపేట్‌లో డిఆర్బిసి (దళిత బహుజన రిసోర్స్ సెంటర్) ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో మండల వ్యాప్తంగా యువతి, యువకులు పాల్గొన్నారు. ప్రీమియర్ హెల్త్‌కేర్ సొసైటీ, ఎస్బిఐ కార్డ్స్, అపోలో, పెరమ్ గ్రూప్స్, జి4ఎస్ సెక్యురిటి, అపోలో మెడ్‌స్కిల్స్, శ్రీవిజయ బయో ఫర్టిలైజర్స్ తదితర కంపెనీలకు చెందిన అధికారులు అభ్యర్థుల ద్రువపత్రాలను పరిశీలించి, అర్హత, నైపుణ్య శిక్షణ కోసం కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్‌లోని కంపెనీ శిక్షణ కేంద్రాలకు ...
Read More »పేదల ఆపద్బాంధవుడు కేసీఆర్
నిజాంసాగర్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదల ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సీడీసీ చైర్మన్ పట్లోళ్ల దుర్గా రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామంలో బూర్గుల్ గ్రామానికి చెందిన యం.తులశవ్వకు సీఎం రిలీఫ్ పండ్ 33 వేల 500 రూపాయల చెక్కును సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ గైని విఠల్ శనివారం అందజేశారు. అనంతరం దుర్గరెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రజల మనిషి అని, ప్రజల కష్టాలను తీరుస్తున్న ఏకైక సీఎం కెసిఆర్ ...
Read More »