Breaking News

Daily Archives: August 18, 2019

కామారెడ్డి మునిసిపాలిటీ పనులు వేగవంతం చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టియుఎఫ్‌ఐడిసి పథకం క్రింద కామారెడ్డి పట్టణ మున్సిపాలిటీలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఆదివారం సిరిసిల్ల రోడ్‌లో డంపింగ్‌ యార్డ్‌ను పరిశీలించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. స్థానిక ఇందిరా నగర్‌ స్మశానవాటికలో పూజ మందిర్‌, టాయిలెట్స్‌, కాంపౌండ్‌ వాల్‌ స్టార్మ్‌ డ్రైన్‌ వాటర్‌ పనులను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు. స్థానిక హౌసింగ్‌ బోర్డ్‌ స్మశానవాటికలో మోటర్‌ పంప్‌ మరమ్మతులు ...

Read More »

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునికి సన్మానం

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జహీరాబాద్‌ ఎంపీ బి.బి.పాటిల్‌, బోయినపల్లి వినోద్‌ కుమార్‌ను కలిసి శాలువా, పుష్పగుచ్చంతో సన్మానించారు. కాగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపధ్యక్షునిగా వినోద్‌కుమార్‌ ఎన్నికైన తెలిసిందే.

Read More »

మునిసిపల్‌ పనితీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో మునిసిపల్‌ పనుల తీరును జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మునిసిపల్‌ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోపు పనులు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు.

Read More »

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్యాసంపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 369 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తదనంతరం గ్రామంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ బాలకిషన్‌ గౌడ్‌, వెంకట్‌ గౌడ్‌, గంగాధర్‌ గౌడ్‌, జెపి శ్రీనివాస్‌ గౌడ్‌, బాలాగౌడ్‌, టి.శ్రీనివాస్‌ గౌడ్‌, సంతోష్‌ గౌడ్‌, జెసి శ్రీనివాస్‌ గౌడ్‌, నర్సాగౌడ్‌, ప్రవీణ్‌ గౌడ్‌, నవీన్‌ గౌడ్‌, లక్ష్మణ్‌ గౌడ్‌, రాజగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

రోడ్డు ప్రమాదంలో వృద్దుడు మృతి

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదిఆరం చేగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్‌ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో వృద్దుడు మృతి చెందాడు. ఇందుకు నిరసనగా సుమారు 3 గంటల పాటు జాతీయ రహదారిఫై రెడ్డిపల్లి గ్రామస్తులు రాస్తారొకో చేశారు. జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది.

Read More »

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

బీర్కూర్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం బీర్కూర్‌ కేంద్రంలో జరిగిన వంటగ్యాస్‌ వినియోగదారుల అవగహన సదస్సులో బీర్కూర్‌ ఎంపిటిసి సందీప్‌ పటేల్‌ పేదలకు ఉచిత వంటగ్యాస్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కషి చేస్తున్నాయని చెప్పారు. కాబట్టి పేదప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గంగారాజ్‌గౌడ్‌, ఇండియన్‌ గ్యాస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More »