Breaking News

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ అవెర్నేస్‌ ఫోరమ్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ కాముని సుదర్శన్‌ నేత ఇండియన్‌ కాంస్టిట్యూషన్‌ (భారత రాజ్యాంగం) తెలుగు వెర్షన్‌ పుస్తకం అందించారు. సమావేశంలో కాముని సుదర్శన్‌ నేత మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారత పౌరులు అందరూ చదవాలని, తెలుసుకోవాలని, భారత రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలని కాన్సిట్యూషనల్‌ అవేర్‌నెస్‌ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తాము భారత రాజ్యాంగం పట్ల మేదావులతో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు.

త్వరలోనే కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి సదస్సులను నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో గ్రామ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ రవి, గర్ల్స్‌ హై స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, వార్డు మెంబర్లు, యువ యూత్‌ అధ్యక్షులు బోల్లు శ్రీకాంత్‌, కాముని శ్రీను, సంతోష్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *