Breaking News

తాడ్‌బిలోలిలో దాణా పంపిణీ

రెంజల్‌, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో బుధవారం లబ్దిదారులకు దాణా పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్‌ సునీత ప్రారంభించారు. గ్రామంలో 36 మంది లబ్దిదారులకు మంజూరైన గొర్రెల దాణాను అందజేశారు.

పంపిణీ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీ, పశువైద్యాధికారి విఠల్‌, శ్రీకష్ణ యాదవ సంఘం అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌, మాజీ ఎంపీటీసీ నర్సయ్య, గ్రామ టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, రైసస జిల్లా సభ్యుడు మౌలానా, గ్రామస్తులు శ్రీనివాస్‌, దేవేందర్‌, రూపేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *