Breaking News

తెరాస గ్రామ కమిటీల ఏర్పాటు

ఆర్మూర్‌, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మచ్చర్ల గ్రామంలో తెరాస పార్టీ గ్రామ కమిటీ, అనుబంధ కమిటీలు, రైతు, మహిళ, యువజన, ఎస్‌సి, బిసి సెల్‌ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సూచన మేరకు కమిటీలు వేయడం జరిగిందన్నారు. ఎంపిపి పస్క నర్సయ్య మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన వారు పార్టీ నిర్మాణానికి కషి చేయాలనీ, ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేసి జీవన్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు.

వివిధ గ్రామాల సర్పంచ్‌లు గంజి నర్సయ్య, లింబారెడ్డి, కళ్లెం మోహన్‌, గణేష్‌, బండమీద గంగాధర్‌, రాజేశ్వర్‌ పాల్గొన్నారు. తెరాస గ్రామ అధ్యక్షులు బొంత ధావిద్‌, యువజన సంఘం అధ్యక్షులు బోజన్న, మహిళా సంఘం అధ్యక్షులు దివ్య, రైతు సంఘం అధ్యక్షులు సిరంపురం గంగారెడ్డి ఎన్నికయ్యారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *