Breaking News

కందకుర్తి రైతులకు అండగా ఉంటాం

రెంజల్‌, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టా పాసు పుస్తకాల కోసం రెంజల్‌ మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కందకుర్తి రైతులు చేపట్టిన దీక్ష బుధవారం నాటికి 15వ రోజుకు చేరడంతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రైతులకు సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల భూములకు సంబంధించిన పట్టా పాస్‌ పుస్తకాల కోసం రైతులు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు.

రైతులు గత 15 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం సిగ్గుచేటని ఎద్దేవాచేశారు. 120 మంది రైతుల పొట్ట కొట్టడం ప్రభుత్వానికి చెల్లిందన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు తమ పార్టీ మద్దతు ఉండడమే కాకుండా దీని విషయంపై జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లోలపు రజినీ, జడ్పిటిసి విజయ, బీజేపీ మండల అధ్యక్షుడు సంతోష్‌, మాజీ ఎంపిటిసి కిషోర్‌ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *