Breaking News

పరీక్ష రాసిన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌ ఆదర్శ లా కాలేజీలో ఎల్‌ఎల్‌ఎం దూర విద్యను అభ్యసిస్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి బుధవారం చివరి సంవత్సరం యొక్క రెండవ సేమ్‌ పరీక్షకు కాకతీయ యూనివర్సిటీలో హాజరయ్యారు.

ఇది చివరి సేమ్‌ కావడంతో ఆయన వరంగల్‌ పట్టణానికి బుధవారం ప్రొద్దున్నే చేరుకొని అక్కడ గ్రూప్‌ డిస్కషన్లో పాల్గొని పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. ఇదివరకే ఆయన రాసిన అన్ని పరీక్షలలో ఉత్తీర్ణుడైన విషయం తెలిసిందే.

కాగా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి రానున్న రోజుల్లో పిహెచ్‌డి చేయడం తన ఆశయమని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *