Breaking News

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

నిజాంసాగర్‌, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా సిర్గపూర్‌ మండలంలోని జంలతాండ గ్రామ పంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి బుధవారం హాజరై హరితహారం మొక్కలు నాటారు. గ్రామ సర్పంచ్‌ దివ్య భారతి – చరణ్‌ తిలకం దిద్ది ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. మొక్కలు నాటిన అనంతరం ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డిని సర్పంచ్‌ పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు.

అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్‌ వెంకటరామిరెడ్డి, జిల్లా ఎస్సి, ఎస్టి విజిలెన్స్‌ కమిటీ మెంబర్‌ రవీందర్‌ నాయక్‌, మండల ఎంపీపీ మహిపాల్‌ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్‌ రావు పాటిల్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

అలాగే నారాయణఖేడ్‌ మండలంలోని చల్లగిద్ద తండా గ్రామపంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి మొక్కలు నాటినారు. అనంతరం భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహార కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, ప్రతి ఒక్క వ్యక్తి 6 మొక్కలను నాటి వాటి సంరక్షణ పకడ్బందీగా చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో హరితహారం మొక్కలను పెంచాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఎంపీపీ చాందీ బాయ్‌ చౌహాన్‌ శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్‌ వెంకటరామిరెడ్డి, మండల ఎంపీపీ చాందీ బాయి – రాంచందర్‌ చౌహాన్‌, జెడ్పీటీసీ లక్ష్మీబాయి – రవీందర్‌ నాయక్‌, ఖేడ్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సందీప్‌, మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్‌, గ్రామ సర్పచ్‌ సుశీల – రమేష్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *