Breaking News

సబ్సిడీ చేపలను విడుదల చేసిన ఘనత తెరాసదే

నిజాంసాగర్‌, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్య శాఖ అభివద్ధి కోసం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కషి చేస్తుందని అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని సింగీతం ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతు బంధు పథకం కింద ఎకరానికి 6 వేల రూపాయలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఎక్కడా లేని విధంగా మత్స్య శాఖ అభివద్ధి కోసం చేపపిల్లలను వంద శాతం సబ్సిడీ ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం జరిగిందని, రాష్ట్రంలో అభివద్ధిలో ముందంజలో ఉన్నామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం ప్రతి గడపకు అదేవిధంగా సీఎం కేసీఆర్‌ కషి చేస్తున్నారని, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేయడం జరిగిందన్నారు.

ఆడపడుచుల పెళ్లి కోసం 1 లక్ష 116 రూపాయలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్‌ పర్సన్‌ ధపెదర్‌ శోభ రాజు, జెసి యాదిరెడ్డి, ఆర్డీఓ రాజేశ్వర్‌, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్‌ ధపెదర్‌ రాజు, జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణిమ, నాయకులు విజయ్‌, కాశయ్య, వాజిద్‌ అలీ, మహేందర్‌, మత్స్యశాఖ డైరెక్టర్‌, తదితరులు ఉన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *