Breaking News

ఇద్దరు రెవెన్యూ అసిస్టెంట్ల సస్పెండ్‌

కామారెడ్డి, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామ విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ పుప్పల రవిని, మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌ కుమారి ఎం.రవళిని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు మాచారెడ్డి మండల తహసిల్దార్‌ వై.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

గతంలో తహసీల్దారుగా పనిచేసిన శ్యామల కాలంలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో వీరిద్దరూ అవకతవకలకు పాల్పడ్డారని, తమ పేరు మీద, తమ బంధువుల పేరు మీద పట్టాదారు పాసు పుస్తకాలు నమోదు చేసుకోవడం, విధి నిర్వహణలో గ్రామస్తులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తదితర ఆరోపణలు ఈనెల 17వ తేదీన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా వారిద్దరి పైన వచ్చినందున విచారణ నిర్వహించి, విలేజ్‌ సర్వెంట్‌ సర్వీసెస్‌ 42 రూల్‌ ప్రకారం వారిద్దరిని విధుల నుండి సస్పెండ్‌ చేసినట్లు తహసీల్దార్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *