నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టుదల కషి తపన ఉంటే క్రీడాకారులు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను ఉన్నత శిఖరాలను సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. గురువారం జాతీయ క్రీడ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ గ్రౌండ్లో పండుగలా జరిపారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ముందుగా హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏలాంటి వసతులు సౌకర్యాలు లేని ...
Read More »Daily Archives: August 29, 2019
రాష్ట్రస్థాయి శిక్షణకు జిల్లా ఎంపిపిలు
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల బలోపేతం, గ్రామీణ ఆర్థిక వనరులు, వ్యస్థాపన అనే అంశంపై హైదరాబాద్‌లో శిక్షణ తరగతులకు కామారెడ్డి జిల్లా ఎంపీపీలు హాజరయ్యారు. కామారెడ్డి ఎంపీపీ ఆంజనేయులు, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు, పిట్లం ఎంపీపీ కవిత, బీర్కూర్ ఎంపీపీ రఘు హాజరయ్యారు. రాష్ట్ర పైనాన్స్ కమిషన్ శిక్షణ నిర్వహిస్తుంది.
Read More »జూనియర్ కళాశాలలో కొత్త కోర్సు
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వత్తి విద్యా కోర్సు ఎంపిహెచ్‌డబ్ల్యు (ఎఫ్) 2019 – 2020 విద్యా సంవత్సరం నుండి ప్రారంభం కానుంది. కోర్సుకు సంబంధించి 3 అదనపు పోస్టులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎమ్మెల్యే కతజ్ఞతలు తెలిపారు.
Read More »వివాహిత ఆత్మహత్య
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ఉదయం సుమారు ఎనిమిది గంటల సమయంలో చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన కరణాల లత (24) అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. మృతురాలికి భర్త రాజు, ఇద్దరు కుమారులు ఒకరు 4 సంవత్సరాలు, మరొకరు 6 సంవత్సరాలు ఉన్నట్టు తెలిపారు.
Read More »కళాశాలల బంద్ విజయవంతం
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిక్కనూర్‌లోని దక్షిణ ప్రాంగణంలో నూతన కోర్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న ఇక్కడి కోర్సులను మెయిన్ క్యాంపస్‌కు తరలించడం జరిగిందని, ఇక్కడ కోర్సులు లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులకు దూరప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని భవనాలతో పాటు నూతన కోర్సులను మంజూరు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ ...
Read More »పత్తి పంట అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న
నిజాంసాగర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాగలిగిద్ద మండలంలోని కరాస్ గుత్తి గ్రామంలో ఆత్మ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రత్తి పంటపై రైతుల అవగాహన కార్యక్రమానికి శాసనసభ్యులు భూపాల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ పంటకు సంబందించిన కరపత్రాలను విడుదల చేసి మన ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేస్తున్న సౌకర్యాల గురించి మరియు చెట్ల పెంపకాన్ని గురించిన అవశ్యకతను తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మెన్ రమావత్ రామ్ సింగ్, ...
Read More »తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తులకు సన్మానం
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో నూతనంగా నియమితులైన న్యాయ మూర్తులు కె.లక్ష్మణ్ గౌడ్, టీ.వినోద్ కుమార్‌లను హైదరాబాద్‌లో గురువారం కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో నిజామాబాద్ న్యాయవాదులు సన్మానం చేశారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ రాజ్ కుమార్ సుబేదార్, రాష్ట్ర కో కన్వీనర్ సాయి రెడ్డి, న్యాయవాధి పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్, కో కన్వీనర్ ఉదయ్ కష్ణ, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఈగ ...
Read More »కామారెడ్డి శాంతి కమిటీ సమావేశం
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయములో జిల్లా శాంతి కమిటీ సమావేశమము కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. జిల్లా ఎస్పి శ్వేతా రెడ్డి, జేసీ యాదిరెడ్డి, ఆర్డివో పాల్గొన్నారు. అలాగే అన్ని శాఖల అధికారులు, 22 మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, కామారెడ్డి గణేష్ మండళ్ల సభ్యులు, కామారెడ్డి గణేశ్ ఉత్సవ కమిటి సభ్యులు, డీసీసీ ప్రెసిడెంట్ మాజీ మున్సిపల్ చైర్మన్ ”కైలాస్ శ్రీనివాస్, పుల్లూరి సతీష్, మాజీ మున్సిపల్ ...
Read More »సెప్టెంబర్ 1న ‘వానచుక్క’ ఆవిష్కరణ
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిదా రచయితల సంఘం, నిజామాబాద్ నిర్వహణలో ప్రముఖ కవి, కవన కిరీటి, హరిదా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు రచించిన వానచుక్క శతకం ఆవిష్కరణ సభ ఏర్పాటు చేసినట్టు సభాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1 ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక మున్నూరు కాపు కళ్యాణమండపం, ప్రగతి నగర్లో కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్య అతిధిగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, గౌరవ అతిథులుగా డాక్టర్ ...
Read More »ఎన్ఫోర్సుమెంట్ అధికారుల దాడి – 11 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
రెంజల్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని సాటాపూర్ గ్రామంలోని తెలంగాణ చౌరస్తాలో గల హోటల్లో ఎన్ఫోర్సుమెంట్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టి దాడులు నిర్వహించారు. ప్రధాన కూడల్లో గల పాషా హోటల్, తాజ్ హోటల్, జైభవాని, అమత హొటల్లో ఎన్ఫోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించి 11 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేని సిలిండర్లు వాడుతున్నట్టు సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు ఎన్ఫోర్సుమెంట్ డిటి శశిభూషన్ తెలిపారు. పట్టుకున్న సిలిండర్లను స్థానిక గ్యాస్ ఏజెన్సీలో అప్పగించమన్నారు. జరిమానా కోసం ...
Read More »రూ. కోటి 50 లక్షలతో గ్రంథాలయ ఆధునీకరణ
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంధాలయాన్ని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయాన్ని సుమారు ఒక కోటి యాభై లక్షల రూపాయలతో ఆధునీకరించి నందుకు, దేశంలోనే కామారెడ్డి గ్రంధాలయాన్ని 8వ స్థానంలో నిలిపినంధుకు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంపత్ గౌడ్, సెక్రెటరీ సురేష్లను ఎమ్మెల్యే ఆభినందించారు. ఈ సందర్భంగా పుస్తకాల కొనుగోలుకు స్వంతంగా 25 వేల రూపాయలు ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మరో 25 ...
Read More »శ్రద్దాంజలి
నిజాంసాగర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల విద్యా వనరుల కేంద్రం నిజాంసాగర్ మండల విద్యావనరుల సిబ్బంది పెద్దపల్లి జిల్లాకు చెందిన డిఎంఎల్టి రమేష్ సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తూ అక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఆయన పై అధికారులు వేధించడం వలన మనస్థాపానికి గురై 20 రోజుల క్రితం తప్పిపోయి శవంగా దొరికారు. అందుకు నిరసనగా కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో పని చేస్తున్న ఎస్ఎస్ఏ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తు శ్రద్ధాంజలి ఘటించారు. ఇందులో భాగంగా నిజాం సాగర్ ...
Read More »పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం
నిజాంసాగర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిట్లం మండలంలోని రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లి తండ్రుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ మాట్లాడుతూ ఎస్యంటి కమిటీలోని సభ్యుల కొందరు పిల్లలు బడి వదిలి వెళ్లిపోవడంతో వారి స్థానంలో కొత్త సభ్యులను ఏక గ్రీవంగా తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 1 నుండి పదవ తరగతి పిల్లల్లకు ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తున్నామని కావున పిల్లల కు అల్పాహారం అంధించి అందరూ ఉదయం సాయంత్రం హాజరయ్యేలా తల్లిదండ్రులు ...
Read More »ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
ఆర్మూర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని మానస హై స్కూల్లో హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మదిన సందర్భంగా జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ హాకీ క్రీడా మాంత్రికుడు అయిన ధ్యాన్ చాంద్ స్ఫూర్తితో విద్యార్థులు క్రీడలో రాణించాలని సూచించారు. క్రీడల వల్ల శరీరానికి వ్యాయామం మరియు మనస్సుకు ఆహ్లాదం చేకూరుతుందని అన్నారు. క్రీడల వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం ...
Read More »ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కుల పంపిణీ
ఆర్మూర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన ఇర్ల దేవిదాస్ రూ 1 లక్ష, బూస లక్ష్మికి 24 వేలు, ఉట్నూర్ నర్సుబాయికి 20 వేలు ముగ్గురు లబ్ది దారులకు గురువారం ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను బాల్కొండ తెరాస పార్టీ మండల అధ్యక్షుడు దాసరి వెంకటేష్, ఎంపీపీ యనుగంటి లావణ్య-లింగాగౌడ్ చేతుల మీదగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా దాసరి వెంకటేష్ మాట్లాడుతూ బాల్కొండ ...
Read More »ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన
నిజాంసాగర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం స్థానిక కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి ఇతర నాయకులతో కలిసి ఏరియా హాస్పిటల్లో అన్ని వార్డులో కలిగి తిరిగి పరిశీలించారు. అన్ని హంగులతో నిర్మించిన ఎల్లారెడ్డి ఆసుపత్రిలో సరిపడా వైద్యులతో పాటు సిబ్బంది మరియు కనీస సౌకర్యాలు లేకపోవడంతో బీద ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరాలు తెలుసుకొని ఫోన్ ద్వారా జిల్లా ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఎమ్మెల్యే గెలిచి ఇప్పటికి 8 నెలలు గడుస్తున్నా ...
Read More »సిఎం సహాయనిధి చెక్కు అందజేత
ఆర్మూర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూరు గ్రామానికి చెందిన యమునకు గురువారం సీఎం సహాయ నిధి క్రింద ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి 1 లక్ష 50 వేల రూపాయల సంబంధిత చెక్కుని వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ తెరాస కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Read More »