Breaking News

Daily Archives: September 1, 2019

మొక్కలు నాటడం అందరి బాధ్యత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భావితరాలకు మంచి సమతుల్యమైన వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో ఉద్యమంగా చేపడుతున్నట్లు నిజామాబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బీగాల గణేష్‌ గుప్తా అన్నారు. ఆదివారం తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నగరంలోని గౌతమ్‌ నగర్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద మెప్మా ఆధ్వర్యంలో మహిళలచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రభుత్వానికి తనకు సంబంధించిన అంశం మాత్రమే ...

Read More »

పోలింగ్‌ స్టేషన్లు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 31 డిసెంబర్‌ 2001న లోపు పుట్టిన వారందరూ ఓటర్‌ గుర్తింపు కార్డు పొంద వచ్చునని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఆదివారం ఉదయం ఓటర్‌ నమోదు ప్రక్రియను పరిశీలించేందుకు నగరంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శంకర్‌ భవన్‌ హైస్కూల్లో 49 నుండి 56 మరియు 100 పోలింగ్‌ స్టేషన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు నమోదుకు మార్పులు చేర్పుల కోసం సంబంధిత దరఖాస్తులను సిద్ధంగా ...

Read More »

స్వచ్ఛ తలవేదయే లక్ష్యం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని తలవేదా గ్రామంలో మన ఊరు మన బాధ్యత స్వచ్చంద సంస్థ అద్వర్యంలో ఆదివారం గ్రామములో వీధులలో శుభ్రత కార్యక్రమము చేపట్టారు. ఎస్‌సి కాలనిలో పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాల శుభ్రత చేపట్టారు. అదేవిదంగా ఇంటి ఇంటికి తిరిగి మరుగుదొడ్ల నిర్మణాము ఆవశ్యకత గూర్చి, అంటు రోగాల నివారణ గూర్చి అవగాహన కల్పించారు. ఇది నిరంతరముగా ప్రతి ఆదివారం చేపడుతున్న కార్యక్రమము అని సంస్థ సభ్యులు తెలిపారు.

Read More »

కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకునే బాధ్యత నాదే

రెంజల్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి కార్యకర్త కష్టసుఖాలను తెలుసుకునే బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని, బూత్‌ కమిటీల ద్వారా కార్యకర్తలను పటిష్టం చేసి గ్రామల్లో గ్రామ కమిటీలు వేసి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఎంపీ కవితను ఓడగొట్టుకుని తప్పుచేశామని కవిత ఓడినా ...

Read More »

గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ నియామకంపై హర్షం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయను నియమించడంపై నందిపేట మండలం కురుమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, బీసీ నాయకుడిగా గుర్తింపు, ఆయన నీతి నిజాయితీ గౌరవించి కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌గా ఉన్నత స్థానాన్ని కట్టబెట్టి హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. బండారు దత్తాత్రేయ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు నందిపేట మండలం కురుమ సంఘము ...

Read More »

నిండుకుండాల త్రివేణి సంగమం

రెంజల్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమంలో గోదావరి వరద నీరు చేరడంతో త్రివేణిసంగమ క్షేత్రం నీటితో కలకళలాడుతుంది. గత రెండు మూడు రోజుల నుండి మహారాష్ట్ర ఎగువన కురిసిన భారీ వర్షం కురవడంతో బాబ్లీ, విష్ణుపురి గేట్లను ఎత్తివేయడంతో కందకుర్తి గోదావరికి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో త్రివేణి సంగమం కొత్త కలను సంతరించుకుని గోదావరి నది ఉదతంగా ప్రవహిస్తుంది. నిన్నటి వరకు చుక్క నీరు లేక వెలవెలబోయిన గోదారమ్మ నేడు కొత్త పుంతలు ...

Read More »

సిఎం సహాయనిధి అందజేత

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిర్గపూర్‌ మండల కేంద్రానికి చెందిన తెరాస పార్టీ కార్యకర్త బాలయ్య అనారోగ్యంతో మరణించి నందున వారి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అందజేశారు. వారితో పాటు మండల పార్టీ అధ్యకులు సంజీవ్‌ రావు పాటిల్‌, గ్రామ ఉపసర్పంచ్‌ రాజు, వార్డ్‌ మెంబర్‌ రాజ గౌడ్‌, తదితరులు ఉన్నారు.

Read More »

మైనార్టీ యువకునికి రుణ సహాయం

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఎల్లారెడ్డి లో మైనారిటీ సంక్షేమం కోసం స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, ఎమ్మెల్సీ వి.జి గౌడ్‌, ప్రతాప్‌ రెడ్డి రుణాలు అందజేశారు. మైనారిటీ కార్పొరేషన్‌ రుణం క్రింద బీసీ కాలానికి చెందిన నయిమ్‌ ఉద్దీన్‌కు పాన్‌ షాప్‌ పెట్టుకోవడానికి 50 వేల రూపాయల చెక్కును అందచేశారు. మండల నాయకులు కుడుముల సత్యం, జలంధర్‌ రెడ్డి, నర్సింలు, ఇమ్రాన్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

Read More »

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఒక ప్రకటనలో జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, పర్యావరణ హితం కొరకు ప్రజలు మట్టి గణపతులనే ఉపయోగించాలని కోరారు. అదేవిధంగా నవ రాత్రుల సందర్భంగా, మిగతా రోజుల్లోనూ అన్ని సమయాల్లోనూ ప్లాస్టిక్‌ను తగ్గించుకోవడానికి లేదా పూర్తిగా నిషేధించడానికి ముందుకు రావాలని కోరారు. ప్లాస్టిక్‌ ద్వారా ఏర్పడే విపరీత పరిణామాలను ...

Read More »

ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జాక్టో ఆదివారం ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద తలపెట్టిన ఉపాధ్యాయ గర్జన కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 19 ఉపాధ్యాయ సంఘాలకు చెందిన బాధ్యులు ఉపాధ్యాయులు వేలాది సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. ఉపాధ్యాయ గర్జనలో జాక్‌ టు కో కన్వీనర్‌ ఎస్సీ, ఎస్టీ ...

Read More »

భక్తి, శ్రద్దలతో పండుగ జరుపుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను అసలే వాడకుండా మట్టితో చేసిన వినాయక ప్రతిమలు మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించుకొని పర్యావరణాన్ని కాప్పాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జిల్లా కలక్టరేట్‌ కార్యాలయంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని కలెక్టరేట్‌ సిబ్బందికి జేసి వెంకటేశ్వర్లు డిఅర్‌ఓ అంజయ్యతో కలిసి జిల్లా కలెక్టర్‌ మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సిబ్బందికి అధికారులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ...

Read More »