Breaking News

Daily Archives: September 3, 2019

నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి పురుగుప్త తెలిపారు. రుద్రూర్‌ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక కొత్త అంబేద్కర్‌ భవన్‌లో నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి, కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పురుగుప్త మాట్లాడుతూ ప్రతి ప్రాంతంలో, అన్ని ఆవాసాలలో వాన నీటిని సంరక్షించడంతో పాటు భూగర్భ జలాలు అభివద్ధి ...

Read More »

కార్యకర్తల సమావేశం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండల కేంద్రం లోని తెరాస పార్టీ కార్యాలయంలో జహీరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నారాయణఖేడ్‌, ఎల్లారెడ్డి మున్సిపల్‌ ఎన్నికల ఇంచార్జ్‌ జిన్నారం వెంకటేష్‌ గౌడ్‌, స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ సమావేశానికి హాజరై కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశంలో ఎల్లారెడ్డి మున్సిపల్‌లోని కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Read More »

ప్రాజెక్టు నీటి మట్టాన్ని పరిశీలించిన అధికారులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కళ్యాణి, సింగీతం ప్రాజెక్టులను సందర్శించి ప్రాజెక్టు నీటి మట్టాన్ని డిప్యూటీ ఈఈ దత్తాత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచి, వస్తున్న ఇన్‌ ఫ్లోను ప్రధాన కాలువలోకి మళ్ళించడం జరుగుతుందని తెలిపారు. ప్రధాన కాలువ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు కాలువ వైపు వెళ్ళకూడదని అన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డీఈ వెంట ...

Read More »

మల్లారం చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని లింగంపల్లి అటవీ ప్రాంతంలో గల మల్లారం చెరువుకు బుంగ పడిందని గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు మంగళవారం ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజల సురేందర్‌ మల్లరం చెరువుకు బుంగ పడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్షణమే ఎమ్మెల్యే నిధుల నుండి నిధులు మంజూరు చేయించి ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేయిస్తానని, ఆ తర్వాత శాశ్వతంగా అభివద్ధి పనులు చేయిస్తామన్నారు. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తే లింగంపల్లి రైతులకు రెండు ...

Read More »

భవాని మాతకు ప్రత్యేక పూజలు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హాజిపూర్‌ కట్ట క్రింద తండాలో భవానిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా సేవాలాల్‌ మహారాజ్‌కు కూడా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బద్యా నాయక్‌, ఉపాధ్యక్షుడు యశ్వంత్‌ రావు నాయక్‌, మండల అధ్యక్షుడు లింబేస్‌ నాయక్‌, బాన్స్‌వాడ మండల అధ్యక్షుడు రాము నాయక్‌, హజీపూర్‌ తండా సర్పంచ్‌ చాందీ బాయి, కుమారుడు భీమల్ల నాయక్‌, తండా నాయకులు అమ్మలు, అక్కలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Read More »