Breaking News

Daily Archives: September 4, 2019

పొంగి పొర్లుతున్న కామారెడ్డి పెద్ద చెరువు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువు పొంగి పొర్లుతుంది. నిండుకుండలా మారి అలుగులు పొంగి పొర్లుతున్నాయి.. 2016 తర్వాత వర్షం ముఖం చాటేసింది. తిరిగి ఇన్నేళ్ల తర్వాత భారీగా కురిసిన వర్షం కారణంగా పెద్ద చెరువు నిండింది.. నీటితో కళకళ లాడుతోంది… ధీంతో చెరువు అందాలను తిలకించేందుకు పట్టణ వాసులు కుటుంబాలతో తరలి వస్తున్నారు. చెరువు అందాలను వీక్షిస్తూ నీటిలో ఆడుతూ సేదతీరుతున్నారు. చెరువు నిండడంతో పట్టణ వాసుల నీటి కష్టాలు ...

Read More »

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు బస్వంత్‌రావు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న బస్వంత్‌ రావుకు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించింది. గురువారం జరిగే గురుపూజోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ రావలసిన ఆహ్వానం అందింది.

Read More »

కలిసికట్టుగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలుపై జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాల పరిదిలోని మండల ప్రత్యేక అధికారులు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ అధికారులు, సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ ఇంచార్జి అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలోని జిఆర్‌ఆర్‌ గార్డెన్‌లో జరిగిన సదస్సుకు శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇది కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా జరిగే ప్రణాళిక అన్నారు. అధికారులు, ...

Read More »

ఆశాలకు కనీస వేతనం అమలు చేయాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు 10 వేల వేతనం ఇవ్వాలని, నిజాంసాగర్‌ పిహెచ్‌సిలో ఆశ వర్కర్లు కలిసి మండల వైద్య అధికారి రాధాకష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆశ వర్కర్లు అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ లో పని చేస్తున్న ఆశ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, 18 వేల వేతనం ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్‌ 2, 2015 అలాగే డిసెంబర్‌ 16 వరకు 106 రోజులు ఆశలు ...

Read More »

ఎరువుల పంపిణీలో ఇబ్బందులు రాకుండా చూడండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎరువుల పంపిణీలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సమానంగా అవసరాల మేరకు పంపిణీ జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా సంతప్తికరంగా వర్షాలు కురుస్తున్నందున రైతులు పంటలు సాగు చేస్తున్నారని, అందుకు అనుగుణంగా వారికి అవసరమైన ఎరువులను విత్తనాలను అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ఎరువులు ముఖ్యంగా ...

Read More »

30 రోజుల ప్రణాళిక పకడ్బందీగా చేపట్టాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లాలోని సర్పంచ్‌లు, గ్రామ సెక్రటరీలు, ప్రభుత్వ అధికారులు 30 రోజుల గ్రామపంచాయతీ ప్రణాళిక కార్యక్రమం కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేశారు. ఇందులో ఎంపీ బీబీ పాటిల్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శోభరాజు, కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ, డిపిఓ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ నిర్వహించిన 30 రోజుల గ్రామపంచాయతీ అభివద్ధి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. సర్పంచ్‌ గ్రామ పంచాయతీ యొక్క 30 రోజుల అభివృద్ధి ...

Read More »

జగిత్యాల కలెక్టరేట్‌ ఎదుట రైతుల ఆందోళన

జగిత్యాల, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని యూరియా కొరత కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, పంటలను కాపాడుకునేందుకు వెంటనే జిల్లాకు సరిపడు యూరియాను తెప్పించి కొరత నివారించాలని కోరుతూ బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయం జిల్లా రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. కొరత కారణంగా తాము పంటలు నష్టపోతున్నామని ప్రభుత్వం వెంటనే సరిపడా యూరియా పంపిణీ చేయాలని, ...

Read More »

నేర రహిత తెలంగాణకు కృషి చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ 320 డి ఆద్వర్యంలో బుదవారం నిజామాబాదు నగర శివారులోని అమత గార్డెన్స్‌లో ఆచార్య దేవోభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు చెందిన 106 మంది ఉపాద్యాయులను లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో సభాపతి పోచారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాద్యాయులు తమ మేధాశక్తి ద్వారా విద్యార్థులకు చిన్నతనంలోనే ...

Read More »

ఆపద్బందు చెక్కు అందజేత

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలంలోని సీతారాం తాండ గ్రామపంచాయతికి చెందిన బానోత్‌ గోప్య నాయక్‌కు ఆపద్బందు పథకం ద్వారా ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్‌ రెడ్డి చెక్కు అందజేశారు. గోప్య నాయక్‌కు చెందిన గేదె ఇటీవల మరణించి నందున విద్యుత్‌ శాఖ తరుపున ఆపద్బంధు పథకం ద్వారా ఆర్థిక సహాయంగా 40 వేల రూపాయల చెక్కును అందజేశారు.

Read More »

పరిసరాలు పరిశుభ్రంగా కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో పట్టణాల్లో అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా కనిపించేలా మిషన్‌ మోడ్‌లో పని చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో జిల్లా అటవీ అధికారి మున్సిపల్‌ అధికారులతో హరితహారం పారిశుద్ధ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల కార్యక్రమంపై ఆదేశాలు జారీ చేశారని ఈ కార్యక్రమాన్ని పట్టణాల్లో కూడా నిర్వహించాలని తద్వారా పరిశుభ్రతతో పాటు సీజనల్‌ ...

Read More »