Breaking News

ఎరువుల పంపిణీలో ఇబ్బందులు రాకుండా చూడండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎరువుల పంపిణీలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సమానంగా అవసరాల మేరకు పంపిణీ జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా సంతప్తికరంగా వర్షాలు కురుస్తున్నందున రైతులు పంటలు సాగు చేస్తున్నారని, అందుకు అనుగుణంగా వారికి అవసరమైన ఎరువులను విత్తనాలను అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ దిశగా ఎరువులు ముఖ్యంగా యూరియా పంపిణీలో వీలైనంత మేరకు రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని ప్రాంతాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఎప్పటికప్పుడు జిల్లాకు చేరుకునే ఎరువుల వివరాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

రైతులు సాగు చేసే పంటలకు అనుగుణంగా ఎరువుల సరఫరాను చేయాలని ఎక్కువ తక్కువలు కాకుండా అందరికీ అందే విధంగా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, ఏడిఏ వాజిద్‌ హుస్సేన్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *