Breaking News

Daily Archives: September 5, 2019

విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఏ రంగంలో ముందుకు వెళ్లడానికి ఇష్టపడతారో వారిని అందుకు అనుగుణంగా ప్రోత్సహించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు తెలిపారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణన్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కొత్త అంబేద్కర్‌ భవన్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన ...

Read More »

గణనాథునికి ప్రత్యేక పూజలు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ పట్టణంలోని సువర్ణ టాకీస్‌ రోడ్డులో బజరంగ్‌ దల్‌ నారాయణఖేడ్‌ శాఖవారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పార్టీ నాయకులు సాయిరాం, నగేశ్‌ గుప్తా, విజయ్‌, బజరంగ్‌దళ్‌ సభ్యులు జగదీష్‌, ప్రవీణ్‌, సంతోష్‌ తదితరులు ఉన్నారు.

Read More »

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజక వర్గం నాగిరెడ్డి పెట్‌ మండలం బొల్లారం గ్రామానికి చెందిన చిట్టి రాములు అనే కాంగ్రెస్‌ కార్యకర్త ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మతి చెందాడు. కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి ముగ్గురు ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు కుటుంబాన్ని పరామర్శించారు. సంస్థ ద్వారా 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.

Read More »

టిఆర్‌ఎస్‌ గ్రామకమిటీ ఎన్నిక

రెంజల్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ టిఆర్‌ఎస్‌ గ్రామకమిటీని గురువారం సర్పంచ్‌ వికార్‌ పాషా ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా వడ్ల శంకర్‌, ఉపాధ్యక్షుడిగా మదర్‌ సాబ్‌, ప్రధాన కార్యదర్శిగా భూమయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే షకీల్‌కు, మండల టిఆర్‌ఎస్‌ నాయకులకు సర్పంచ్‌ వికార్‌ పాషాలకు ధన్యవాదాలు తెలిపారు. టిఆర్‌ఎస్‌ పార్టీకి నిరంతరం సైనికులుగా ఉంటూ కషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సాటాపూర్‌ గ్రామ టిఆర్‌ఎస్‌ నాయకులు ...

Read More »

గ్రామ సమగ్రాభివృద్దికి 30 రోజుల ప్రణాళిక

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కి ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ప్రవేటు ఫంక్షన్‌ హాల్‌లో ప్రజా ప్రతినిధులు అధికారులకు 30 రోజుల గ్రామపంచాయతీ కార్యాచరణ అమలుపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో కలెక్టర్‌ మాట్లాడారు. విస్తత ప్రజా భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాలు అభివద్ధి జరిగినప్పుడే దేశం పరిపూర్ణ అభివద్ధి చెందుతుందని, గ్రామ పాలనలో గుణాత్మక మార్పును తీసుకుని వచ్చే ప్రయత్నంలో ప్రజా ప్రతినిధి, అధికారులు, ...

Read More »

అంగన్‌వాడిలో గర్బవతులకు శ్రీమంతం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో గురువారం హౌసింగ్‌ బోర్డు కాలనీలో అంగన్‌వాడీ ఆద్యర్యంలో పోషణ మాసం సందర్బంగా గర్భవతులకు శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయురాలు అందె పుష్పలత మాట్లాడుతూ గర్భిణీలకు పోషక ఆహారాల గురించి వివరించి, వారు తీసుకునే జాగ్రత్తల గురించి సూచించారు. ఈ కార్యక్రమానికి గర్భిణీలు, కాలనీకి చెందిన తల్లులు పలువురు పాల్గొన్నారు.

Read More »

గురువులే మార్గదర్శకులు

రెంజల్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో గురువుల కషి వలనే విద్యార్థుల భవిష్యత్తు బంగారు మయమవుతుందని, విద్యార్థులకు గురువులే మార్గదర్శకులని ఎంపీపీ లోలపు రజినీ, జడ్పీటీసీ మేక విజయ అన్నారు. గురువారం మండలకేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని మండల విద్యాశాఖ ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి రాధాకష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యారంగానికి సర్వేపల్లి చేసిన కషిని ...

Read More »

ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌పల్లి మండలం గాంధీ నగర్‌ గ్రామంలో ఆక్స్‌ఫర్డ్‌ హైస్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల కరస్పాండెంట్‌ గణేష్‌ సర్వేపల్లి రాధాకష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రసంగించారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలని, మంచి స్థాయిలో ఉండి దానికి కారణమైన గురువులను జీవితాంతం గుర్తుంచుకోవాలని తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శోభ, విద్యార్ధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

యుద్దప్రాతిపదికన యూరియా సరఫరా చేయాలి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ రంగంలో యూరియా కొరతను నివారించి రైతులను ఆదుకోవాలని ఏఐకేఎమ్‌యస్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. గురువారం ఆర్మూర్‌లోని కుమార్‌ నారాయణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో యూరియా కొరత లేదని కానీ తెలంగాణాలో వ్యవసాయ, మార్క్‌ఫెడ్‌ల సమన్వయ లోపం కారణంగా యూరియా కొరత ఏర్పడుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ రైతాంగానికి తీవ్ర అన్యాయం ...

Read More »

వసతి గృహాన్ని తనిఖీ చేసిన స్పీకర్‌

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఎస్‌సి బాలికల కాలేజి హాస్టల్‌ను తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అకస్మీకంగా తనిఖీ చేశారు. ఉదయం అల్పాహారం సమయంలో హాస్టల్‌కు వెళ్లిన స్పీకర్‌ విద్యార్ధినుల కోసం వండిన పదార్ధాలను పరిశీలించారు. మేను ప్రకారం గురువారం వండిన ఉప్మాను పరిశీలించిన స్పీకర్‌ అందులో వాడాల్సిన పప్పు దినుసులు లేకపోవడం, రుచిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో ఇలాగే వండుతారా, మీ పిల్లలకు ఇలాగే తినిపిస్తారా ...

Read More »

ఉపాధ్యాయులకు సన్మానం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం గురుపూజోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గరెడ్డి, ఎయంసి చైర్మన్‌ గైని విఠల్‌, సీడీసీ చైర్మన్‌ దుర్గరెడ్డిలు ఎంపీడీవో తోట పర్బన్నలు కలిసి ఉపాధ్యాయులను సన్మానించారు. సన్మానం పొందిన వారిలో ఉమ మహేశ్వరీ, మహమ్మద్‌ నగర్‌, సయ్యద్‌ నబీ, ఎం శంకర్‌, వెల్గనూర్‌, నాగరాజు, కోమలాంచ, జోషి శ్రీధర్‌ హసన్‌ పల్లి ఉన్నారు. కార్యక్రమంలో ...

Read More »

ఉపాధ్యాయ దినోత్సవం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం దివంగత పూర్వ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాక ష్ణన్‌ జయంతి సందర్భంగా ఎంపీ బిబి పాటిల్‌ తన కార్యాలయం లో సర్వే పల్లి రాధాక ష్ణన్‌ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అలాగే రవీంద్ర భారతిలో జరిగే ”ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంపీతో పాటు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వర్యులు జగదీశ్వర్‌ రెడ్డి, ఉన్నత అధికారులు పాల్గొన్నారు. పలువురు ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ సముదాయానికి ...

Read More »

మూగ చెవిటి వారికీ ద్విచక్ర వాహన లైసెన్స్‌ ఇవ్వాలి

నిర్మల్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూగ చెవిటి వైకల్యాలు కల్గిన వారికీ సైతం ద్విచక్ర వాహన లైసెన్స్‌లు జారీ చేయాలనీ నిర్మల్‌ మూగ, చెవిటి అసోసియేషన్‌, తెలంగాణ స్పందన దివ్యాంగుల హక్కుల సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్మల్‌ జిల్లా రవాణా శాఖ అధికారి అజయ్‌ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా రవాణా శాఖ అధికారి సానుకూలంగా స్పందించి మూగ, చెవిటి వైకల్యాలు గల దివ్యాంగులు తమ వాహనానికి వారికీ స్పందించిన చిహ్నాలు, స్టిక్కర్ల గుర్తులు తమ ...

Read More »

కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ రోజు శేట్పల్లి సంగారెడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో కో ఆప్షన్‌ సభ్యులుగా ముగ్గురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒక్కరు విశ్రాంతి ఉద్యోగి కమ్మరి వెంకటేశం, డ్వాక్రా మహిళ అధ్యక్షురాలు బీకండ్ల సంగామని, కమ్మరి భూపతి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అనీల్‌ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు బోధనపు ఇందిరా, మండల కోఆప్షన్‌ సభ్యులు బాబు జాని, ఉప సర్పంచ్‌ సాయిలు, రైతు కమిటీ గ్రామ అధ్యక్షుడు పండరీ, వార్డు సభ్యులు, నాయకులు అంజయ్య, సుభాష్‌, ...

Read More »

ఏబివిపి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ ఆర్మూర్‌ శాఖ అద్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, గర్ల్స్‌ కళాశాల, క్షత్రియ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రీటింగ్‌ కార్డ్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్‌ నల్ల నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎబివిపి ఉద్యమాలు చేయడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుంటుందన్నారు. విద్యార్ధి ఉద్యమాలే కాకుండా విద్యార్థులలో ఉండే నైపుణ్యాలను వెలికితీసే ఉపాధ్యాయులు ఎంతోమంది ...

Read More »

జాతీయ సమావేశాల గోడప్రతుల ఆవిష్కరణ

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలం కేంద్రంలోని జడ్పిహెచ్‌ఎస్‌ హై స్కూల్‌లో (ఏఐఎస్‌బి) ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ బ్లాక్‌ ఆధ్వర్యంలో జాతీయ సమావేశాలు జయప్రదం చేయాలని జిల్లా కన్వీనర్‌ భైరాపూర్‌ రవీందర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. దేశ వ్యాప్తంగా విద్యారంగం ఎదుర్కొంటున సమస్యలపైన జాతీయ సమితి సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈపాటికె అనేక విద్యారంగా సమస్యలపైన ఉద్యమాలు నిర్వహిస్తున్న ఏఐఎస్‌బి రాబోయే కాలంలో మరింత బలమైన ఉద్యమాలు చేయడానికి సమావేశలు తోడ్పడుతాయని తెలిపారు. తెలంగాణ ...

Read More »

హరిత, ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దడంలో సర్పంచ్‌లదే కీలకపాత్ర

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలను హరిత వనంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. 30 రోజుల గ్రామ పంచాయతీల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై స్థానిక బిఎల్‌ఎన్‌ గార్డెన్‌లో ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రపతి తర్వాత సర్పంచ్‌ను మాత్రమే ప్రథమ పౌరుడు అంటారని, అదేవిధంగా రాష్ట్రపతి తర్వాత ఒక్క ...

Read More »