Breaking News

గ్రామ సమగ్రాభివృద్దికి 30 రోజుల ప్రణాళిక

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కి ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ప్రవేటు ఫంక్షన్‌ హాల్‌లో ప్రజా ప్రతినిధులు అధికారులకు 30 రోజుల గ్రామపంచాయతీ కార్యాచరణ అమలుపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో కలెక్టర్‌ మాట్లాడారు. విస్తత ప్రజా భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాలు అభివద్ధి జరిగినప్పుడే దేశం పరిపూర్ణ అభివద్ధి చెందుతుందని, గ్రామ పాలనలో గుణాత్మక మార్పును తీసుకుని వచ్చే ప్రయత్నంలో ప్రజా ప్రతినిధి, అధికారులు, ప్రజలు బాధ్యతా యుతంగా వ్యవహరించాలన్నారు.

ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్ది అవకాశం వచ్చినందున ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా పనిచేయాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వము నిర్దేశించిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈనెల 6 నుండి జిల్లాలో గ్రామ సభలు ఏర్పాటుచేసి ప్రజలతో చర్చించి గ్రామానికి అవసరమైన తక్షణ పాక్షిక దీర్ఘకాలిక అభివద్ధి కోసం ప్రణాళికలను సిద్ధం చేయాలని, ఈ ప్రణాళికలో ప్రభుత్వం అధికారులను ప్రజా ప్రతినిధులు ప్రజలను భాగస్వామ్యం చేసి పల్లె ప్రగతి కి దోహదపడే విధంగా కషి చేయాలని అన్నారు.

ప్రభుత్వ నిర్దేశించిన ప్రకారంగా తమ గ్రామాలను అభివద్ధి చేసుకొని ప్రజాప్రతినిధులుగా గ్రామంలో మంచి పేరు కొని తెచ్చుకోవాలని ఆయన చెప్పారు. ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత వారిదేనని, స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, తమ గ్రామాల అభివద్ధికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరిశుభ్రత, మంచి వాతావరణంలో జీవించేందుకు అవకాశం వచ్చిందని ఆయన అన్నారు.

గ్రామాలను బయటనుండి వచ్చి అభివద్ధి చేసుకోవలసిన అవసరం లేదని గ్రామస్తులందరూ ప్రజాప్రతినిధులకు అధికారులకు తోడై అభివద్ధికి ముందుకుపోవాలని చెప్పారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారంగా 4 కమిటీలను కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవలసి ఉంటుందని, అభివద్ధి పనులు సభ్యుల ఆమోదంతోనే చేయాలని గ్రామ బడ్జెట్‌ తయారులో గ్రామానికి అవసరమైన ప్రాథమిక అంశాలను గుర్తించి, వాటి అమలు కషిచేయాలని చెప్పారు.

హరిత హారంలో ప్రతి ఇంటికి ఆరు మొక్కలను నాటాలని చెప్పారు. ప్రతి గ్రామంలో వందకు వందశాతం విద్యుత్‌ స్తంభాలకు 3వ వైరు అమర్చుకోవాలి, బడ్జెట్‌ రూపకల్పనలో గ్రామం యొక్క ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకొని అభివద్ధి కార్యాచరణ చేపట్టాలని చెప్పారు. 30 రోజుల అభివద్ధి కార్యాచరణ ప్రణాళికలో ఎన్నిక కాకముందు తమరు ఏ లక్ష్యమైతే ఎంపిక చేసుకున్నారో దాన్ని సాధించేందుకు అవకాశం వచ్చిందని, గ్రామాల్లో ఆరోగ్యకరమైన పోటీ తత్వంతో ముందుకు పోయి గ్రామ సమగ్రాభివద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు.

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్న గారి విఠల్‌రావు మాట్లాడుతూ గ్రామాలలో పార్టీలకతీతంగా పారదర్శకంగా పనిచేయాలని ప్రజాసేవే లక్ష్యంగా సేవలందించాలని చెప్పారు. ఈనెల 7న కో ఆప్షన్‌ మెంబర్‌లను ఎంపిక చేయాలని వారు కూడా ప్రజా సేవకై ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. పంచాయితీలో 4 స్టాండింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ఒక్కొక్క కమిటీలో 15 మంది సభ్యులలో, 50 శాతం మహిళలు ఎంపిక చేయాలని చెప్పారు.

హరితహారం కమిటీ వీధి దీపాల కమిటీ, పనుల కమిటీ, వైకుంఠ దామం కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివద్ధికి నెలకు 339 కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక లక్ష నుండి 5 లక్షలు రూపాయల పైబడి నిధులు మంజూరయ్యే అవకాశముందని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే గ్రామాలు అభివద్ధి జరుగుతుందని, ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే పక్రియలో పెద్ద స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.

ఎంపికైన ఆదర్శ జిల్లాకు ప్రభుత్వము 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందని చెప్పారు. జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి రాథోడ్‌ రమేష్‌ మాట్లాడుతూ రాబోయే తరానికి నీటి ఎద్దడి పరిస్థితి రాకుండా నీటి సంరక్షణ పద్ధతులను పాటించాలని, పడిన వర్షపు నీటిని సంరక్షించుకుంటే భవిష్యత్‌ తరానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పారు. జలసంరక్షణలో ప్రభుత్వం ప్రజలకు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు.

కార్యక్రమంలో జెడ్పీ సీఈవో గోవిందు, డిపిఓ జయసుధ, జెడ్‌పి ఎకౌంటు అధికారి క ష్ణమూర్తి, ఆర్మూర్‌ డివిజన్‌, నిజామాబాద్‌ డివిజన్‌లోని మాక్లూర్‌, సిరికొండ, నవీపేట, ధర్పల్లి మండలాలకు చెందిన జెడ్‌పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు గ్రామ కార్యదర్శులు, గ్రామ స్పెషల్‌ అధికారులు, మండల స్పెషల్‌ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *