Breaking News

విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఏ రంగంలో ముందుకు వెళ్లడానికి ఇష్టపడతారో వారిని అందుకు అనుగుణంగా ప్రోత్సహించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు తెలిపారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణన్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కొత్త అంబేద్కర్‌ భవన్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

జ్యోతి ప్రజ్వలన చేసి రాధాకష్ణన్‌ చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం మాట్లాడారు. ఉపాధ్యాయ వత్తి ఎంతో పవిత్రమైనదని, ఎన్నో వేల లక్షల విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు ఎంతో ధన్యులని తెలిపారు. పాఠశాల ఒక దేవాలయం అయితే ఉపాధ్యాయుడు పూజారి అని, విద్యార్థులు భక్తులని, వారిని మంచి వారిగా తీర్చిదిద్దడానికి వారికి అవసరమైన శక్తిని, విజ్ఞానాన్ని అందించడానికి ఉపాధ్యాయులు కషి చేయాలన్నారు.

తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఉపాధ్యాయులే కారణమని తెలిపారు. హరితహారం ముఖ్యమంత్రి మానసపుత్రిక అని ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులు భాగస్వాములై హరిత తెలంగాణగా తీర్చిదిద్దుకోవడానికి కషి చేయాలన్నారు. అదేవిధంగా ఈ నెల ఆరవ తేదీ నుండి ప్రారంభమయ్యే 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో కూడా అందరూ భాగస్వాములై గ్రామాలు అభివద్ధి చెందడానికి సహాయ సహకారాలు అందించాలన్నారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణ చూపిన మార్గంలోనే ఉన్నత విలువలతో నడవ వలసిన అవసరం ఉందని, భావితరాల వారికి సమాజంలో జీవించడానికి మార్గదర్శనం చేయవలసి ఉందన్నారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర అమోఘమైందని తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం పదో తరగతి ఫలితాలు మంచి ర్యాంకులు సాధించారని వచ్చే సంవత్సరం కూడా మరింత మంచి ఫలితాలు రాబట్టడానికి ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని, చదువుతోపాటు ఉన్నతమైన పౌరులుగా వారిని తీర్చిదిద్దాలని తెలిపారు.

విద్యార్థులను హరితహారం కార్యక్రమంలో గత సంవత్సరంలాగే భాగస్వాములను చేసి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేలా ప్రోత్సహించాలని కోరారు. ముఖ్య అతిథిగా రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ, తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులను దైవంగా భావిస్తారని భయంతో పాటు వారిని గౌరవిస్తారని తెలిపారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన ఉపాధ్యాయ వత్తి లభించినప్పుడు పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి కషి చేయాలని కోరారు.

సర్వేపల్లి రాధాకష్ణన్‌ నడుస్తున్న గ్రంధాలయం అని ఆయన జీవితమే మనందరికీ ఆదర్శం అని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల గురించి తనకు తెలుసని ముఖ్యమంత్రి, ప్రభుత్వం దష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించడానికి కషి చేస్తానన్నారు.

అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయబడిన 30 మందిని సన్మానించారు. కార్యక్రమంలో ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్‌, డీఈవో దుర్గాప్రసాద్‌, డైట్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ డీఈవో పద్మనాభం, ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *