Breaking News

Daily Archives: September 6, 2019

30 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతికి ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని డోంకేశ్వర్‌ సర్పంచ్‌ నాయకుడి ఛాయా అన్నారు. శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి 30 రోజుల గ్రామపంచాయతీ కార్యాచరణ అమలుపై ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాలు అభివద్ధి జరిగినప్పుడే దేశం అభివద్ధి చెందుతుందని, గ్రామ పాలనలో గుణాత్మక మార్పును తీసుకుని వచ్చే ప్రయత్నంలో ప్రజలు బాధ్యతా యుతంగా వ్యవహరించాలన్నారు. డొంకేశ్వర్‌ను ఆదర్శ ...

Read More »

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం ప్రభుత్వ దవాఖానలో 3 కెసిఆర్‌ కీట్‌లను అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, డీఎంహెచ్‌ వో చంద్రశేఖర్‌ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో పట్టణాల్లో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రైవేటుకు ధీటుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలన్నీ హరితవనంగా పరిశుభ్రంగా ఏర్పడాలని అన్నారు. పిట్లం వైద్యాధికారి శివ కుమార్‌, తదితరులు ఉన్నారు.

Read More »

ఐదో విడతలో రెండు కోట్ల 85 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు భాగస్వామ్యం కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలం కోనాపూర్‌ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిభ హాస్పిటల్‌ ఎం.డి. డాక్టర్‌ మోతిలాల్‌ జాదవ్‌ కోనాపూర్‌, హన్మాజి పేట, సంగోజీపేట్‌ గ్రామాలకు హరితహారం కార్యక్రమం సంబంధించి మొక్కల సంరక్షణ కోసం 2 వేల ట్రీ గార్డులు, ఎనిమిది వందల కొబ్బరి మొక్కలు బహూకరించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య ...

Read More »

లక్కంపల్లి సెజ్‌ ప్రారభోత్సవంలో గందరగోళం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలంలోని లక్కంపల్లి సెజ్‌లో మెగా ఫుడ్‌ పార్కు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపి, ఎంఎల్‌ఏ మాట్లాడుతుండగా రాజకీచ పార్టీ కార్యకర్తలు గందరగోళం సష్టించారు. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మాట్లాడుతుండగా భాజపా నాయకులు మోదీ… మోదీ.. అని, అదే విదంగా ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతుండగా కేసీఆర్‌, కేసీఆర్‌ అంటు పసుపు బోర్డు ఎక్కడ అని టిఆర్‌ఎస్‌ నాయకులు హోరా హోరీ నినాదాలు చేసి గందరగోళం సష్టించారు. ...

Read More »

రాష్ట్రంలో లక్కంపల్లి అతిపెద్ద మెగా యూనిట్‌

నందిపేట్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల శాఖ మంత్రి హర్‌ సిమ్రత్‌ కౌలు బాదల్‌ వెల్లడించారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలంలోని లక్కంపల్లిలో 108 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మెగా ఫుడ్‌ పార్కును కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలితో కలిసి ఆమె ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ...

Read More »

గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు

రెంజల్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కరించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్‌లు తెలిపారు. మండలంలోని తాడ్‌ బిలోలి, బొర్గం, మౌలాలి తండా, సాటాపూర్‌, నీలా, పేపర్‌ మిల్‌, కందకుర్తి, వీరన్నగుట్ట, దూపల్లి, వీరన్నగుట్ట తండా, అంబేద్కర్‌ నగర్‌, కళ్యాపూర్‌, కిషన్‌ తండా, దండిగుట్ట, కునేపల్లి బాగేపల్లి గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యను గ్రామ సభల ద్వారానే పరిష్కరించేందుకు కషి చేస్తామన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరింపడుతుందన్నారు. తాగునీరు, ...

Read More »

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జుక్కల్‌ ఎంపీడీఓ కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించారు. నాగల్‌ గావ్‌ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాద్యాయుడు షేక్‌ ఉమర్‌, లొంగన్‌ గ్రామంలో విధులు నిర్వహించే ఉపాద్యాయుడు సాయన్నను మండల రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శాలువా, పుష్పగుచ్ఛం అందించి వారికి ప్రోత్సహించడం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారు తమ విధుల పట్ల ప్రత్యేక దష్టి వహించి ...

Read More »

కామారెడ్డి జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని వార్డులలో పారిశుధ్యం లోపించిందని, వైరస్‌ జ్వరాలు ప్రబలి పోతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్‌ సమీక్ష సమావేశం పెట్టి అధికారులను అప్రమత్తం చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని ఎంసిపిఐయు ప్రతినిధులు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చర్య తీసుకొని జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అభివద్ధి చెందని గ్రామాలు, మండలాలు, రామారెడ్డి ఇఇ తాడువాయి గాంధారి, లింగంపేటలతో పాటు బాన్సువాడ డివిజన్‌లోని జుక్కల్‌, బిచ్కుంద, మద్నూర్‌, ...

Read More »

విద్యార్థులే ఉపాధ్యాయులుగా

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యాబోధన చేశారు. కస్తూర్బా గాంధీ ప్రత్యేకాధికారి సరోజనతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల బోధన పరిశీలించారు, విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అకౌంటెంట్‌ సుమన్‌ బాయ్‌, ఉపాధ్యాయులు సరిత కుమారి, పద్మావతి, సుమలత, శ్రీ వాణి, సవితా, శకుంతల, గీతా, స్వప్న, రజిత, ఒకేషనల్‌ పార్జనా బేగం తదితరులు ఉన్నారు.

Read More »

రెంజల్‌ ఎంపిడివోగా గోపాలకష్ణ

రెంజల్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల ఎంపిడివోగా గోపాలకష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు మోస్రా ఎంపిడివోగా విధులు నిర్వహించిన గోపాలకష్ణ బదిలీల్లో భాగంగా రెంజల్‌ ఎంపిడివోగా నియమితులయ్యారు. రెంజల్‌ మండల ప్రజాపరిషత్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ఇంచార్జి ఎంపిడివోగా కొనసాగగా శుక్రవారం ఆయన వద్ద నుండి గోపాలకష్ణ ఎంపిడివోగా బాధ్యతలు స్వీకరించారు.

Read More »

గణేశ్‌ మండపం వద్ద కుంకుమార్చన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఆర్యనగర్‌ కాలనీలో భారత్‌ యూత్‌ గణేష్‌ మండలి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. గణేష్‌ మండపం వద్ద శుక్రవారం 5వ రోజు కుంకుమపూజతో పాటు స్వామి వారికి ప్రత్యేక అలంకరణ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు సేనాపతి పూజలు జరిపించారు. మహిళలు పూజ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారికి హారతులు, అర్చన నిర్వహించారు. కార్యక్రమంలో విగ్రహ దాత మున్నం శ్రవణ్‌ కుమార్‌, కాలనీ వాసులు ప్రసాద్‌, జ్ఞానేశ్వర్‌, శివ, ...

Read More »

శ్రీచైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ ఆర్మూర్‌ శాఖ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ నల్ల నవీన్‌ కుమార్‌ మాట్లాడారు. కేవలం రాజధానికి పరిమితమైన కార్పొరేట్‌ విద్యాసంస్థలు నేడు రాజధాని నుండి మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తూ కెసిఆర్‌ కొమ్ముకాస్తున్నారని అయన అన్నారు. ప్రభుత్వ నిబంధలను తుంగలో తొక్కి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ...

Read More »

రాంపూర్‌ గ్రామసభ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ఆర్మూర్‌ మండలం రాంపూర్‌ గ్రామంలో గ్రామ సర్పంచ్‌ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. 30రోజుల ప్రణాళిక గురించి వివరించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ దయానంద్‌, గ్రామ రెవిన్యూ అధికారి శుంఖరి జీవన్‌ రావ్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ గంగారాం, పంచాయితీ కార్యదర్శి, ఉపసర్పంచ్‌, మహిళలు, యువకులు, పాల్గొన్నారు.

Read More »

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

రెంజల్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే ఘనత ఉపాధ్యాయులకే దక్కుతుందని సర్పంచ్‌ వెల్మల సునీత నర్సయ్య అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికపై తాడ్‌ బిలోలి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు శ్రీనివాస్‌ రెడ్డి, రవీందర్‌, రాజేందర్‌ సింగ్‌, రాజు లను శుక్రవారం సర్పంచ్‌ సునీత ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా తాడ్‌ బిలోలి గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు ఎంపికవ్వడం అభినందనీయమని అన్నారు. ...

Read More »

ఫుడ్‌పార్కు అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తోందని కేంద్ర మంత్రి హారసింగ్‌ కౌర్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలంలోని లక్కంపల్లి సెజ్‌లో మెగా ఫుడ్‌ పార్కు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఫుడ్‌ పార్క్‌ అభివద్ధి కొరకు సర్పంచ్‌ నుండి మంత్రి వరకు అందరూ కలిసి కషి చేయాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు నేరుగా సహాయం చేయాలనే సంకల్పంతో ...

Read More »

పేదలకు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్‌ వరం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్నూర్‌ మండల తహసీల్‌ కార్యాలయ ఆవరణలో కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్టు పార్టీ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్‌, సర్పంచ్‌ దారస్వర్‌ సురేష్‌ తెలిపారు. కార్యక్రమంలో శాసనసభ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే ద్వారా లబ్ధిదారులకు చెక్కులు అందించారు. మద్నూర్‌ మండలంలోని 31 కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్‌ చెక్కులు వారి యొక్క కుటుంబ సభ్యులకు అందించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొని ఎమ్మెల్యే ...

Read More »

కోతుల దాడిలో ఒకరికి గాయాలు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని స్థానిక బస్టాండ్‌ వద్ద ఆటో డ్రైవర్‌ ఇదయత్‌ అలీ పై కోతులు దాడి చేసి అతని చెవిని కొరికేశాయి. అలాగే బీసీ కాలని ఇళ్ల లోకి దూరి కోతులు ఇల్లంతా చిందర వందర చేస్తూ అడ్డు వచ్చిన మహిళలపై దాడులు చేస్తూ నానా హంగామా చేస్తున్నాయి. మున్సిపాలిటీ, అటవీశాఖ అధికారులు కోతుల మూకపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామాల్లో, పట్టణాలలో కోతుల బెడద ఎక్కువ ఉందని ప్రతి ...

Read More »

వీరే మండల ఉత్తమ ఉపాధ్యాయులు

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల ఉత్తమ ఉపాద్యాయ పురస్కారం-2019 ఎంపికైన ఉపాధ్యాయుల వివరాలు బీర్కూర్‌ ఎంఇవో నాగేశ్వర్‌రావు వెల్లడించారు. బీర్కూర్‌ మండలంలో ఉపాధ్యాయ వత్తిలో ఉన్నత ప్రమాణాలను నిలుపుతూ విద్యా శాఖలో యథాశక్తి గా తమ వంతు ఉత్తమ సేవలు అందించినందుకు మండల స్థాయిలో ఉత్తమ ఉపాద్యాయ పురస్కారం-2019 కి ఎంపిక చేసినట్టు తెలిపారు. వీరిలో …. సులోచన ఎల్‌ఎఫ్‌ఎల్‌-పిఎస్‌, బీర్కూర్‌, రామస్వామి ఎస్‌ఎ, యుపిఎస్‌ తిమ్మాపూర్‌, మేకల గంగాధర్‌ ఎస్‌ఏ, జడ్పిహెచ్‌ఎస్‌ బీర్కూర్‌, గంగాధర్‌ ...

Read More »