Breaking News

Daily Archives: September 7, 2019

డెంగ్యూ నివారణకు ఉచితంగా హోమియో మందులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విస్తరిస్తున్న డెంగ్యూ వ్యాధిని నివారించడానికి ప్రజలకు హోమియో టాబ్లెట్స్‌ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శనివారం రాత్రి కలెక్టర్‌ చాంబర్‌లో ఆయుష్‌ శాఖ వైద్య బందం కలెక్టర్‌ను కలిసి డెంగ్యూ నివారణకు ఉపయోగించే మందు బిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆయుష్‌ వైద్య అధికారులతో మాట్లాడుతూ మందు బిల్లల ఉపయోగంపై ప్రజలకు విస్తతంగా ప్రచారం చేయాలని, అవగాహన కల్పించాలని తెలిపారు. అన్ని ఆయుష్‌ ఆసుపత్రుల్లో ...

Read More »

రూ. 4 కోట్ల అభివద్ధి పనులు ప్రారంబించిన ఎమ్మెల్యే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 12 సీసీ రోడ్డు పనులకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శంకుస్థాపన చేశారు. కామారెడ్డి మున్సిపల్‌ 32వ వార్డు కల్కినగర్‌ కాలనీలో రోడ్ల అభివద్ధిపై ఎమ్మెల్యే గంపగోర్దన్‌ను మాజీ వార్డు సభ్యుడు పోతరాజు వెంకటేష్‌ అధ్వర్యంలో కాలనీ వాసులు కలిసి విన్నవించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి 25 లక్షల రూపాయలతో సిసి రోడ్లు వేయడం జరుగుతుందని తెలిపారు. కాలనీ వాసులు ఎమ్మెల్యేకు ...

Read More »

రక్తదాత అపరబ్రహ్మ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్తదాత మరో అపర బ్రహ్మ అవతారమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని పంచాయతీరాజ్‌ టీచర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సహకారంతో జరిగిన రక్తదాన శిబిరంలో దాదాపు 180 మంది ఉపాధ్యాయులు రక్తదానం చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ ఉపాధ్యాయులను అభినందిస్తూ మాట్లాడారు. వ్యవస్థను సన్మార్గంలో పెట్టేది గురువేనని, విద్యార్థికి ...

Read More »

ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటుకు సీఐ ఆర్థిక సహాయం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు స్వచ్చమైన తాగునీటిని అందించడం కోసం 35 వేల రూపాయల ఖర్చుతో ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటుకు సీఐ రాఘవేందర్‌ ముందుకు వచ్చారు. ఈ మేరకు పాఠశాల పీడీ అలివేణి, పేరెంట్స్‌ కమిటీకి శనివారం 35 వేల రూపాయలను అందజేశారు. కార్యక్రమంలో పేరెంట్స్‌ కమిటీ సభ్యులు విజయ్‌, ప్రతాప్‌ చావ్లా, దోమల సత్యం, ముఖీం, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

Read More »

మైనార్టీలకు చెక్కుల పంపిణీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆరుగురు పేద మైనారిటీలకు 3 లక్షల రూపాయల చెక్కులను కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ శనివారం పంపిణీ చేశారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.

Read More »

30 రోజుల ప్రణాళిక పనులు స్పష్టంగా కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల రూపురేఖలు మార్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనుల్లో మార్పు స్పష్టంగా కనిపించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల, గ్రామస్థాయి అధికారులతో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమము ఏ ఒక్క ...

Read More »

అంగన్‌వాడి కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని మైలారం గ్రామం అంగన్‌వాడి సెంటర్‌లో సర్పంచ్‌ యశోద మహేందర్‌ ఆధ్వర్యంలో శనివారం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన, అలాగే గర్భిణీలకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిటిసి మహేందర్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమయచారి, ఏఎన్‌ఎం భవాని, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, అంగన్‌వాడి టీచర్‌ రూప, ప్రత్యేకాధికారి క్రాంతి, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

Read More »

చెరువులో చేపపిల్లల విడుదల

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మాగి గ్రామ శివారులోని చెరువులో సిడిసి చైర్మన్‌ దుర్గారెడ్డి, ఏఎంసి చైర్మన్‌ గైని విఠల్‌, మాగి సర్పంచ్‌ కమ్మరి కత్తా అంజయ్యలు కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వాలు కూడా మత్స్య కార్మికుల గురించి ఆలోచించలేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో వంద శాతం సబ్సిడీ కింద చేపపిల్లలను విడుదల చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ...

Read More »

నాటారు వదిలారు

నందిపేట్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహరం కార్యక్రమం అధికారుల అలసత్వంతో నీరుగారుతున్నది. నందిపేట్‌ మండల కేంద్రంలో మండల కార్యాలయానికి వెళ్లే దారిలో పదిహేను రోజుల క్రితం హరితహారం మొక్కలు నాటారు. మొక్కలు నాటి పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ట్రీ గార్డ్‌లు గాని, ముల్ల కంపలు గాని ఏర్పాటు చేయలేదు. వెంటనే వాటిని ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. లక్ష్యం పూర్తి చేసుకోవడానికి మొక్కలు నాటి చేతులు దులుపుకొంటున్నారని ...

Read More »

వరుస కట్టిన పింఛన్‌ దారులు

నందిపేట్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని తపాలా కార్యాలయానికి ఆసరా పింఛన్‌ దారులు శనివారం భారీగా తరలివచ్చారు. స్థానిక తపాలా కార్యాలయం వద్ద వద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు తమ ఆసరా పింఛన్‌ కొరకు ఉదయం 6 గంటలనుండి వరుసలో నిలబడి పెన్షన్‌ తీసుకుంటున్నారు. వద్ధులకు సరిగా బయోమెట్రిక్‌ వేలిముద్రలు రాకపోవడంతో ఆలస్యం జరుగుతున్నది. ప్రభుత్వం గత నెల రోజుల నుండి ఆసరా పెన్షన్‌ను రెట్టింపు చేయడం జరిగినది. ఇంత పెద్ద సంఖ్యలో పెన్షన్‌ దారులు ...

Read More »

మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలకు రక్షణగా ట్రీగార్డు ఏర్పాటు చేసినట్టు సీడీసీ చైర్మన్‌ దుర్గా రెడ్డి, ఎయంసి చైర్మన్‌ విఠల్‌, ఎంపీడీవో తోట పర్బన్న అన్నారు. ఈ సందర్భంగా దుర్గా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం మొక్కలను ప్రతి ఒక్కరు సంరక్షణ చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఈజీఎస్‌ ఈసి గణేష్‌ నాయక్‌, నాయకులు ప్రవీణ్‌, సందీప్‌, పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప తదితరులు ఉన్నారు.

Read More »

ప్రతి ఒక్కరు ఇద్దర్ని అక్షరాస్యుల్ని చేయాలి

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు అక్షరాస్యులైన ప్రతి ఒక్కరూ కషి చేయాలని డిచ్‌పల్లి మండల పరిషత్‌ అధ్యక్షుడు గద్దె భూమన్న ఉద్బోదించారు. వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ ఆద్వర్యంలో శనివారం డిచ్‌పల్లి ఆదర్శ పాఠశాలలో అక్షర తెలంగాణాలో భాగంగా ఈచ్‌ వన్‌ టీచ్‌ టూ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపిపి భూమన్న ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యత వల్ల దేశ అభివద్ధి కూడా కుంటుబడుతుందని అన్నారు. దేశంలో ...

Read More »

30 రోజుల ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలను అభివద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ 30 రోజుల ప్రణాళిక సిద్ధం చేసి గ్రామ సభలు నిర్వహిస్తున్నారని జహీరాబాద్‌ ఎంపీ బిబి పాటిల్‌ అన్నారు. శనివారం జహీరాబాద్‌ మండలంలోని రాయిపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యే మాణిక్యరావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ రహిత పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. 30 రోజుల గ్రామ పంచాయితీల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం బోధన్‌ మండలంలోని ఊట్‌పల్లి రాజీవ్‌ నగర్‌ తండా గ్రామాలలో జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా కో ఆప్షన్‌ స్టాండింగ్‌ కమిటీల ఎన్నికలను పూర్తిచేయాలని ఎంపిక పూర్తయిన తర్వాత గ్రామాల్లో ప్రతి ...

Read More »

24 గంటలు వైద్య సేవలందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వర్షాకాలం విజంభిస్తున్న విష జ్వరాలను సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలని అందుకోసం 24 గంటలపాటు అవుట్‌ పేషెంట్‌ విభాగాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్థానిక జిల్లా ఆసుపత్రి ముందు ఎం సీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల జిల్లా కేంద్రంలోని ప్రజలు జిల్లా వ్యాప్తంగా ఉన్న పేద మధ్య ...

Read More »

గణేశ్‌ మండపం వద్ద అన్నదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి పట్టణంలో గోల్డెన్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో, సిరిసిల్ల రోడ్డులో గణేశ్‌ మండపం వద్ద సుమారు వెయ్యి మందికి అన్నదానం చేశారు. తెలంగాణ ఆర్యవైశ్య రాష్ట్ర మీడియా కో చైర్మన్‌ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆశించి చేసే దానిని వ్యాపారం అంటారు ఆశించకుండా చేసే దాన్ని సేవ అంటారని, అదే సేవా మార్గంలో గోల్డెన్‌ యూత్‌ ఫెడరేషన్‌ ప్రతి సంవత్సరం అన్నదానం నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. మండలి సభ్యులను ...

Read More »

గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికబద్ధంగా గ్రామాల అభివద్ధికి కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. పల్లెల ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని మల్లారం గ్రామంలో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామస్తులు కలిసికట్టుగా గ్రామ అభివద్ధికి కషి చేయాలని, ముఖ్యంగా హరితహారం పరిశుభ్రతపై ప్రత్యేక దష్టి పెట్టాలని ఆయన కోరారు. 30 ...

Read More »