Breaking News

డెంగ్యూ నివారణకు ఉచితంగా హోమియో మందులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విస్తరిస్తున్న డెంగ్యూ వ్యాధిని నివారించడానికి ప్రజలకు హోమియో టాబ్లెట్స్‌ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శనివారం రాత్రి కలెక్టర్‌ చాంబర్‌లో ఆయుష్‌ శాఖ వైద్య బందం కలెక్టర్‌ను కలిసి డెంగ్యూ నివారణకు ఉపయోగించే మందు బిల్లలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆయుష్‌ వైద్య అధికారులతో మాట్లాడుతూ మందు బిల్లల ఉపయోగంపై ప్రజలకు విస్తతంగా ప్రచారం చేయాలని, అవగాహన కల్పించాలని తెలిపారు. అన్ని ఆయుష్‌ ఆసుపత్రుల్లో సరిపోయినంతగా మందులను అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయుష్‌ శాఖ వైద్యాధికారులు డాక్టర్‌ కష్ణ స్వామి, రమణ మోహన్‌, ఫసియుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *