Breaking News

రూ. 4 కోట్ల అభివద్ధి పనులు ప్రారంబించిన ఎమ్మెల్యే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 12 సీసీ రోడ్డు పనులకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శంకుస్థాపన చేశారు. కామారెడ్డి మున్సిపల్‌ 32వ వార్డు కల్కినగర్‌ కాలనీలో రోడ్ల అభివద్ధిపై ఎమ్మెల్యే గంపగోర్దన్‌ను మాజీ వార్డు సభ్యుడు పోతరాజు వెంకటేష్‌ అధ్వర్యంలో కాలనీ వాసులు కలిసి విన్నవించారు.

దీనిపై ఎమ్మెల్యే స్పందించి 25 లక్షల రూపాయలతో సిసి రోడ్లు వేయడం జరుగుతుందని తెలిపారు. కాలనీ వాసులు ఎమ్మెల్యేకు కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు వెంకటేష్‌ కాలనీ ప్రతినిధులు రఘు, మధు, జీవన్‌, రాజం, లింగం, బాస్కర్‌, దత్తగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *