Breaking News

గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికబద్ధంగా గ్రామాల అభివద్ధికి కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. పల్లెల ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని మల్లారం గ్రామంలో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామస్తులు కలిసికట్టుగా గ్రామ అభివద్ధికి కషి చేయాలని, ముఖ్యంగా హరితహారం పరిశుభ్రతపై ప్రత్యేక దష్టి పెట్టాలని ఆయన కోరారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా కో ఆప్షన్‌ స్టాండింగ్‌ కమిటీలు ఎన్నికలు జరిపి ఎన్నికైన వారితో సర్పంచ్‌, కార్యదర్శి సంయుక్తంగా గ్రామాన్ని పరిశీలించి ఎక్కడెక్కడ ఏయే అవసరాలున్నాయో పరిశీలన చేసి వాటిని పరిష్కారానికి కషి చేయాలన్నారు.

గ్రామ అభివద్ధికి యుద్ధ ప్రాతిపదికన ఏ కార్యక్రమాలు చేపట్టాలో సిద్ధం చేసుకోవాలని చెప్పారు. స్థానిక ప్రజా ప్రతినిధులు స్థానిక అధికారులు సమన్వయంతో ప్రజలకు మరిన్ని సేవలందించే విధంగా ఉండాలన్నారు. గ్రామంలో ప్లాస్టిక్‌ చెత్తను ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వదిలిపెట్టకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామంలో పడిన వర్షపు నీటిని గుంతల్లో నిలిచి ఉండడం, చెత్త కుప్పలను తీసేయకుండా అపరిశుభ్రంగా ఉన్నందున అసంతప్తి వ్యక్తం చేస్తూ రేపటిలోగా పరిశుభ్రంగా ఉండాలని, దానికి సంబంధించిన ఫోటోలను తనకు పంపించాలని సర్పంచ్‌, అధికారులను ఆదేశించారు.

కో ఆప్షన్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక చేపట్టాలని సూచించారు. గ్రామంలో విద్యుత్‌ సరఫరా కోసం స్తంభాలు మూడో వైర్‌ ఏర్పాటు వంగిన శిథిలావస్థలో ఉన్న స్తంభాలను తొలగించి నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. గ్రామంలో హరితహారం కార్యక్రమం ద్వారా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని, ఇప్పటివరకు ఎన్ని మొక్కలు ఎక్కడెక్కడ నాటరో సర్పంచ్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను అడిగి వివరణ తీసుకున్నారు.

మల్లారం లింగేశ్వర దేవాలయం వద్దగల అటవీ ప్రాంతంలో వివిధ ప్రదేశాలలో నాటిన మొక్కలను కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ వెంట రూరల్‌ మండల తహసిల్దార్‌ జ్వాల గిరి రావు, గ్రామ సర్పంచ్‌ నగేష్‌, మండల పరిషత్‌ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *