Breaking News

Daily Archives: September 8, 2019

తెరాస నాయకుల సంబరాలు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లంలో తెరాస నాయకులు ఆదివారం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. హరీష్‌ రావుకు మంత్రి వర్గంలో చోటు దక్కినందుకు అంబేద్కర్‌ చౌరస్తాలో టిఆర్‌ఎస్‌ పార్టీ యువనాయకులు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు.

Read More »

హరిత వినాయకుని పూజలో జిల్లా కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో వివేకానంద వేల్ఫేర్‌ అసోసియెషన్‌ వారు నెలకొల్పిన హరిత వినాయకుని వద్ద ఆదివారం పూజా కార్యక్రమమంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయాలను పాటిస్తు పర్యావరణాన్ని రక్షించడానికి హరిత వినాయకుని పేరుతో ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు.

Read More »

ప్రశాంతంగా గణేష్‌ నిమజ్జనం

రెంజల్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామంలో 7వ రోజు గణేష్‌ శోభాయాత్ర శాంతియుత వాతావరణంలో జరిగింది. ఆదివారం గణేష్‌ నిమజ్జనం సందర్భంగా భారీ బందోబస్తు నడుమ గణేష్‌ శోభాయాత్ర సాగింది. శోభాయాత్రను అదనపు సీపీ భాస్కర్‌, బోధన్‌ ఏసీపీ రఘు ఆధ్వర్యంలో ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి గణేష్‌ శోభయాత్రను నలుగురు సిఐలు, 10 మంది ఎస్సైలు, ప్రత్యేక పోలీసు బలగాలు, స్పెషల్‌ పార్టీ, ఎస్బి నిఘాతో ప్రత్యేక ఏర్పాట్లలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ...

Read More »

గ్రామస్తుల చేతిలోనే గ్రామ భవిష్యత్తు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ భవిష్యత్తు గ్రామస్తులు చేతుల్లోనే ఉందని, అందరూ కలిసికట్టుగా పని చేస్తే ఆదర్శ గ్రామంగా గుర్తింపు వస్తుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఆదివారం కమ్మర్‌పల్లి మండలంలోని ఉప్పులూరు గ్రామాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివద్ధి మౌలిక సదుపాయాల కల్పన కోసం 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామస్తులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్ళితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని ...

Read More »

ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా ఆదివారం జిల్లా కలెక్టర్‌ వేల్పూరు మండలంలోని కోమన్‌ పల్లి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించి మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించేందుకు కషిచేయాలని చెప్పారు. కో ఆప్షన్‌ స్టాండింగ్‌ కమిటీ ఎంపికైన సభ్యులతో శాఖలకు సంబంధించిన గ్రామస్థాయి అధికారులు, ...

Read More »

అందరి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివద్ధి, పచ్చదనం పరిశుభ్రత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేరాలంటే ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. 30 రోజుల గ్రామ పంచాయతీల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం ఆర్మూర్‌ మండలంలోని గగ్గుపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పరిసరాల పరిశుభ్రతపై ద ష్టిసారించాలని, ప్రజలు చెత్తను బయట ఎక్కడ పడితే ఎక్కడ పడేయకుండా నిరోధించేందుకు చర్యలు ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ముందు టిఆర్‌ఎస్‌ యూత్‌ పట్టణ అధ్యక్షులు చెలిమెల భాను ప్రసాద్‌ నేత ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి, కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భానుప్రసాద్‌ నేత మాట్లాడుతూ రెండోసారి కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ని ప్రభుత్వ విప్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ...

Read More »

విద్యారంగానికి నిధులు కేటాయించాలి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని 30 శాతం నిధులు విద్యా రంగానికి కేటాయించాలని పిడిఎస్‌యు డివిజన్‌ ఆద్యక్షుఢు నరేందర్‌ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆర్మూర్‌ పట్టణంలోని కుమార్‌ నారాయణ భవన్‌లో పిడిఎస్‌యు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంటర్‌ విద్యార్ధులకు మద్యహ్న భోజనం ఏర్పాటు చెయ్యాలని, పెండింగ్‌ స్కాలర్‌ షిప్‌, ఫీజు రియంబర్‌ మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేని యెడల అసెంబ్లీ ముట్టడిస్థామని ...

Read More »

చలో కాళేశ్వరం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారీ నీటిపారుదల కాళేశ్వరం ప్రాజెక్టును మండల ప్రజలు సందర్శించడానికి బారులు తీరారు. వివిధ గ్రామాల నుండి గత పదిహేను రోజుల నుండి ప్రతిరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు. అదివారం నందిపేట్‌ గ్రామానికి చెందిన రైతులు చలో కాళేశ్వరం అంటూ ప్రత్యేక వాహనంలో వెల్లి ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. యువ రైతులు, బిజెపి, టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టిడిపి నాయకులు కలిసి నందిపేట్‌ గ్రామం నుంచి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని ...

Read More »