Breaking News

అందరి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివద్ధి, పచ్చదనం పరిశుభ్రత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేరాలంటే ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. 30 రోజుల గ్రామ పంచాయతీల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం ఆర్మూర్‌ మండలంలోని గగ్గుపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పరిసరాల పరిశుభ్రతపై ద ష్టిసారించాలని, ప్రజలు చెత్తను బయట ఎక్కడ పడితే ఎక్కడ పడేయకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని సర్పంచిని, కార్యదర్శిని ఆదేశించారు. ప్రజలు ఆచరించని పక్షంలో జరిమానా వేసి నిరోధించు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం ఉద్దేశించిన ప్రకారంగా కో ఆప్షన్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎంపిక పూర్తయిన తర్వాత గ్రామంలో వాడవాడలా తిరిగి సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలని చెప్పారు.

సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డ్‌కు తరలించాలని వైకుంఠ దామం గ్రామానికి మంజూరు అయినందున పనులను వెంటనే చేపట్టాలని, గ్రామంలో అపరిశుభ్రంగా ఉందని గుంతల్లో నిలిచిన నీటిని తొలగించడం గాని ఎక్కడ పడితే అక్కడ వేసిన చెత్తను తొలగించక పోవడంపై కలెక్టర్‌ కార్యదర్శిపై ఆగ్రహించారు. రేపటిలోగా సర్పంచ్‌, కార్యదర్శి ఎన్నికైన అందరు కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా చేసి నివేదిక అందజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక సమర్థవంతంగా అమలుకు గ్రామానికి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, గగ్గుపల్లి గ్రామ ప్రత్యేక అధికారి ఈజీఎస్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ గణేష్‌ మండల ప్రత్యేక అధికారి ఆర్మూర్‌ పంచాయతీ రాజ్‌ శాఖ ఈఈ రాధా కిషన్‌ విధులకు గైర్హాజరు అయినందున వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామ సర్పంచ్‌ లీలశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎమ్మెల్యేను సన్మానించిన సొసైటీ సభ్యులు

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట్‌ సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, వైస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *