Breaking News

కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ముందు టిఆర్‌ఎస్‌ యూత్‌ పట్టణ అధ్యక్షులు చెలిమెల భాను ప్రసాద్‌ నేత ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి, కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా భానుప్రసాద్‌ నేత మాట్లాడుతూ రెండోసారి కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ని ప్రభుత్వ విప్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ నియమించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేసేందుకు ఎమ్మెల్యే నిరంతరం కషి చేస్తారని తెలిపారు.

కార్యక్రమంలో తెరాస యువజన విభాగం పట్టణ నాయకులు పిలమరీ సతీశ్‌ నేత, భాస్కర్‌ చారి, గొసిక నిఖిల్‌ నేత, భరత్‌ నేత, అక్తర్‌, సాయి కిరణ్‌, రాఘవేంద్ర, నహీం, ఓం ప్రణయ్‌ నేత, రాకేశ్‌, అర్బస్‌, శివ నేత, ఆనంద్‌, ఆధిల్ల్‌, నరేంద్ర తదితరులు ఉన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *