Breaking News

గ్రామస్తుల చేతిలోనే గ్రామ భవిష్యత్తు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ భవిష్యత్తు గ్రామస్తులు చేతుల్లోనే ఉందని, అందరూ కలిసికట్టుగా పని చేస్తే ఆదర్శ గ్రామంగా గుర్తింపు వస్తుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఆదివారం కమ్మర్‌పల్లి మండలంలోని ఉప్పులూరు గ్రామాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివద్ధి మౌలిక సదుపాయాల కల్పన కోసం 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామస్తులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్ళితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా కో ఆప్షన్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు వాడవాడలా తిరిగి సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించేందుకు తమ వంతు బాధ్యతగా కషిచేయాలని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా శిధిలమైన వంకర తిరిగిన స్తంభాలు పాడుబడిన బావులు, చెరువులలో పిచ్చి మొక్కలు తొలగింపు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కో ఆప్షన్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, అధికారులు కలిసి గ్రామంలోని అంతర్గత రోడ్లపై చెత్త తొలగించడం, గుంతలో నిలిచిన నీటిని తొలగించడం చేస్తున్న చర్యలపై కలెక్టర్‌ సంతప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు చొప్పున సరఫరా చేసి నాటించాలని, ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని మరుగుదొడ్డిని తప్పనిసరిగా వినియోగించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని, బహిర్భూమికి వెళ్లకుండా చూడాలన్నారు.

గుర్తించిన వార్డులలో సమస్యలను పరిష్కరించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ ఆర్‌డిఓ శ్రీనివాస్‌, ఎంపీడీవో ఎంపీఓ స్పెషల్‌ అధికారులు గ్రామ సర్పంచ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌ కాలేశ్వరం ప్రాజెక్ట్‌ నీటిని రివర్స్‌ పంపింగ్‌ చేసి వరద కాలువ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టుకు తరలిస్తున్న నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్‌ కమ్మర్‌పల్లి వద్ద పరిశీలించారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *