Breaking News

Daily Archives: September 9, 2019

పీహెచ్‌సిలు పొగాకు రహిత ప్రాంతాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పొగాకు రహిత అంతగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. సోమవారం రాత్రి తన చాంబర్‌లో వైద్యశాఖ అధికారులతో కలిసి ఇందుకు సంబంధించిన సైన్‌ బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జాతీయ అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా జాతీయ పొగాకు మరియు ఉత్పత్తుల నివారణలో భాగంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పొగాకు వాడకాన్ని నిషేధిస్తూ ఉన్నట్టు బోర్డులు ఏర్పాటు ...

Read More »

తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి

రెంజల్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకు ఇచ్చిన మహానీయుడు వైతాళికుడు మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి నారాయణ రావు అని ఎంపీపీ లోలపు రజిని కిషోర్‌, జడ్పీటీసీ మేక విజయ అన్నారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో కాలోజి నారాయణరావు 105వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణనే ఊపిరిగా జీవించిన మహనీయుడు కాళోజి నారాయణ రావు అని, ...

Read More »

జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఇస్రో అధికారి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబర్‌లో జిల్లాలో జరిగే సైన్స్‌ ఫెయిర్‌ను దష్టిలో పెట్టుకొని ఇస్రో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ అనిల్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావును కలిశారు. అక్టోబర్‌లో ప్రపంచ స్పేస్‌ వీక్‌ సెలబ్రేషన్స్‌ సందర్భంగా జిల్లాలో అక్టోబర్‌ 4, 5, 6 తేదీల్లో సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నందున జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆహ్వానించారు. ఆయన వెంట జిల్లా సైన్స్‌ ఫెయిర్‌ అధికారి గంగా కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు అంటూ తన రచనలతో తెలంగాణ కాంక్షను రగిలించిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం కామారెడ్డి మండల కార్యాలయంలో కాళోజీ నారాయణ రావు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కామారెడ్డి మండల అధ్యక్షులు పిప్పిరి అంజన్న, మండల వైస్‌ ఎంపీపీ ఉరుదొండ నరేష్‌ కుమార్‌, ...

Read More »

కామారెడ్డిలో అన్నదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంతోషి ఆదర్శసంఘం సిరిసిల్లరోడ్డులో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కైలాస్‌ శ్రీనివాస్‌ రావు, మాజీ కౌన్సిలర్‌ కైలాస్‌ లక్ష్మణ్‌, పాత ఆనంద్‌, తాటికొండ ప్రసాద్‌, చీల అమర్‌, ఉప్పు సంపత్‌ ,పార్శి ధనంజయ్‌, తాటిపల్లి ప్రవీణ్‌, తమ్మలి సాయి, నిమ్మ శశిధర్‌ రెడ్డి, దత్తారెడ్డి సంఘ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాస్‌ను శాలువా, జ్ఞాపికతో సన్మానించారు.

Read More »

అసంఘటితరంగ కార్మికులకు 25 వేల వేతనం ఇవ్వాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో రెండవ సారి అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏఐసిటియు జిల్లా బాధ్యుడు రాజలింగం అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియన్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థ నిర్ణయించిన వేతనం సగటున ఒక కార్మికునికి కనీస వేతనం 25 వేలు ఉండాలని, దీన్ని అమలు చేయకుండా కనీసం పక్క రాష్ట్రంలో ఉన్న ...

Read More »

తెలంగాణ వైతాళికుడు కాళోజీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెరాస యువజన విభాగం కార్యాలయంలో కాళోజీ నారాయణరావు 104 వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెరాస యువజన విభాగం అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్‌ మాట్లాడుతూ తెలంగాణనే ఉపిరిగా జీవించిన మహానీయుడు కాళోజీ అన్నారు. రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాసరాం రాజా కాళోజీ సెప్టెంబరు 9, 1914లో జన్మించి నవంబరు 13, 2002 పరమపదించారన్నారు. కాళోజీ ...

Read More »

గణేష్‌ శోభాయాత్ర దారిని పరిశీలించిన కలెక్టర్‌, సిపి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 12న గణేష్‌ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కరించుకుని రథం బయలుదేరే మార్గాన్ని కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, సిపి కార్తికేయ పరిశీలించారు. సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌, ఇతర అధికారులతో కలిసి వారు రథం తిరిగే ప్రాంతాల్లో పర్యటించి సదుపాయాలను పర్యవేక్షించారు. స్థానిక దుబ్బ నుండి లలితా మహాల్‌ థియేటర్‌, గాంధీ గంజు, గాంధీచౌక్‌, బోధన్‌ రోడ్‌, గాజులపేట, పెద్ద బజార్‌, గోల్‌ హనుమాన్‌, ఫులాంగ్‌, మీదుగా వినాయక నగర్‌లోని గణపతులు నిమజ్జనం ...

Read More »

ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ దన్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్‌ మన్‌ దన్‌ పథకాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌ రావ్‌ అన్నారు. రెంజల్‌ మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో సోమవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులని, 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయస్సు వారు అర్హులని అన్నారు. వయసుని బట్టి ప్రతి ...

Read More »

జిల్లా స్థాయి క్రీడా పోటీలలో గురుకుల విద్యార్థుల ప్రతిభ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా భిక్కనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగిన నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా స్థాయి వాలీబాల్‌, ఖో-ఖో క్రీడా పోటీలలో ఎల్లారెడ్డి గురుకులానికి చెందిన 36 మంది పాల్గొన్నారు. కాగా 21 మంది విద్యార్థులకు ఖో-ఖో క్రీడల్లో ప్రథమ, ఆరుగురు విద్యార్థులు వాలీబాల్‌లో ప్రథమ స్థానంలో బహుమతులు సాధించారని జిల్లా సంక్షేమ పాఠశాలల కన్వీనర్‌ జి. మహేందర్‌, ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థులు అండర్‌ 14, 17, అండర్‌ ...

Read More »

ఘనంగా కాళోజి జయంతి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని మానస హైస్కూల్‌లో సోమవారం కాళోజి జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా మానస గణేష్‌ అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రసంగించారు. కాళోజి నారాయణ ఉద్యమ కవిగా, ప్రజా కవిగా, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అని కొనియాడారు. కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో విద్యార్ధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Read More »

బాలలపై లైంగిక దాడులు అరికట్టాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలలపై జరిగే లైంగిక వేధింపులు లైంగిక దాడులు అశ్లీలత ప్రదర్శన అరికట్టుట అందరిపై బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం ప్రగతి భవన్‌లో బాలికల విద్య సాధికారిక జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్య్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ బాలబాలికల సాధికారత క్లబ్బులు ఏర్పాటుచేసి లైంగిక వేధింపుల నిరోధక చర్యలపై అవగాహన కల్పించాలని, సంఘటన జరిగిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ...

Read More »

బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు కాళోజీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయులు కాళోజి నారాయణ రావు అని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శ్లాఘించారు. కాలోజి నారాయణరావు 106వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో జిల్లా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ఆయన పడ్డ శ్రమ చేసిన ...

Read More »

కామారెడ్డిలో ఫిజియోథెరఫీ డే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో సోమవారం ప్రపంచ ఫిజియోథెరపీ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, డాక్టర్‌ మౌనిక మోరేకు తెలంగాణ ఆర్యవైశ్య మీడియా కో చైర్మన్‌ విశ్వనాధుల మహేష్‌ గుప్తా, మరియు మక్సుద్‌ హైమద్‌ అడ్వకేట్‌, కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య యూత్‌ అధ్యక్షులు వలిపి శెట్టి భాస్కర్‌ గుప్త సన్మానించారు. కామారెడ్డిలోని శ్రీ సాయి ఫిజియోథెరపీ సెంటర్‌ ఓల్డ్‌ ఎన్‌ హెచ్‌ 7 రోడ్‌ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వనాధుల మహేష్‌ గుప్తా, మాక్సుద్‌ ...

Read More »

కార్మికులకు రూ. 8500 వేతనం చెల్లించాలి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ కార్మికులకు 8500 వేతనంతో పాటు, జీవోను విడుదల చేయాలని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జేఏసీ కార్మిక సంఘాలు ఐఎఫ్‌టియు, సిఐటియు ప్రతినిధులు దాసు, యం. వెంకటి, పి వెంకటేష్‌, జెపి.గంగాధర్‌, సూర రవి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ కార్మికులకు రూ. 8500 వేతనం ప్రకటించి సంవత్సర కాలం గడుస్తున్నా అమలు ...

Read More »

ప్రతిష్టాత్మకంగా 30 రోజుల ప్రణాళిక

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అన్ని శాఖల అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్ష్యాలను పూర్తి చేసేందుకు కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామపంచాయతీల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక ఒక్క శాఖకే సంబంధించింది కాదని అన్ని శాఖాధికారులుకు సంబంధముందని, జిల్లా స్థాయి అధికారుల నుండి గ్రామస్థాయి అధికారులు పాల్గొని ప్రభుత్వం ...

Read More »

సోయం బాబురావు రాక అడ్డగింత

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఆర్మూర్‌ లో సోయాం బాబురావు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుని రాకను ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్‌ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారా రాష్ట్ర కార్య నిర్వాహక ఆద్యక్షుఢు తారాచంద్‌ నాయక్‌ మాట్లాడారు. సోయాం బాబురావు నిజామాబాద్‌లోకి వచ్చి గిరిజన జాతిని విచ్చిన్నం చేయాలను కోవడం ఆయన మూర్ఖత్వమని, నిజామాబాద్‌లో నాయకపోడ్‌, లంబాడాల మధ్య వైరుధ్యం పెంచాలంకుంటే ఈ రోజు పట్టిన గతే ...

Read More »

కిసాన్‌ యోజన పథకంపై అవగాహన

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో సోమవారం ప్రధానమంత్రి కిసాన్‌ మన్‌ దన్‌ యోజన పథకంపై యాళ్ళ రాములు మొమొరియల్‌ హాల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆర్మూర్‌ ఎంపిపి పస్క నర్సయ్య, ఎంపిడిఓ గోపిబాబు, ఏరువాక శాస్త్రవేత్త నవీన్‌ కుమార్‌, మండల వ్యవసాయ అధికారి హరికష్ణలు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వసంత లక్ష్మి, సవిత, రమ్య, నరేశ్‌ కుమార్‌, శరత్‌ చంద్ర, వసుదామ్‌, పలువురు రైతులు పాల్గొన్నారు.

Read More »

రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డయేరియా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి పిల్లలకు వేసే రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ప్రారంభించారు. సోమవారం వినాయక్‌ నగర్‌ నగర్‌లోని పట్టణ ప్రాథమిక కేంద్రంలో పిల్లలకు వ్యాక్సిన్‌ను చుక్కల రూపంలో వేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ 6 వారాల వయసున్న పిల్లలకు వ్యాక్సిన్‌ను మొదటి డోస్‌గా ప్రారంభించి తర్వాత 10వ, 14వ వారం వయసులో రెండవ, మూడవ డోస్‌లుగా వేయడం జరుగుతుందని ఆయన ...

Read More »

ఆదర్శ గ్రామలే లక్ష్యంగా పనిచేయాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ పల్లెలను ఆదర్శ గ్రామలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 30 రోజుల ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలని రెంజల్‌ మండల ప్రత్యేకాధికారి విజయ్‌ కుమార్‌ సూచించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో పర్యటించారు. గ్రామాల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. గ్రామాల్లో ప్రధానంగా పరిశుద్యంపై దష్టి సారించాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 100 శాతం మరుగుదొడ్లను నిర్మాణం చేపట్టి ఉపయోగించుకునేలా చూడాలన్నారు. మురికి కాలువలు శుభ్రం చేయడం, ...

Read More »