Breaking News

అసంఘటితరంగ కార్మికులకు 25 వేల వేతనం ఇవ్వాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో రెండవ సారి అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏఐసిటియు జిల్లా బాధ్యుడు రాజలింగం అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియన్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థ నిర్ణయించిన వేతనం సగటున ఒక కార్మికునికి కనీస వేతనం 25 వేలు ఉండాలని, దీన్ని అమలు చేయకుండా కనీసం పక్క రాష్ట్రంలో ఉన్న వైస్‌ జగన్‌ అమలుచేస్తున్న మాదిరి కనీస వేతనం 18 వేలు కూడా అమలు చేయకపోవడం దారుణమన్నారు.

కార్మికుల వ్యతిరేక వైఖరిని ప్రభుత్వం అవలంబిస్తుందనడానికి నిదర్శనమన్నారు. పొగాకు నిషేధం పేరుతో బీడీ పరిశ్రమ మూత వేయించేందుకు కుట్ర చేస్తూ కార్మికులకు పిఎఫ్‌ తో ముడిపెట్టి జీవన భతిని ఇవ్వకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. ఆశా వర్కర్లకు అంగన్‌వాడి టీచర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న కనీస వేతనం 18 వేల రూపాయలు తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇండియన్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ నిర్ణయించిన కనీస వేతనాన్ని అమలు చేసేందుకు వామపక్ష కార్మిక సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు నిర్వహించి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఐసీటీయు నాయకులు ఖైరత్‌, భూషణం, హైమద్‌ శ్రీనివాస్‌, మద్దెల రాజు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *