Breaking News

ప్రతిష్టాత్మకంగా 30 రోజుల ప్రణాళిక

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అన్ని శాఖల అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్ష్యాలను పూర్తి చేసేందుకు కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు.

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామపంచాయతీల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక ఒక్క శాఖకే సంబంధించింది కాదని అన్ని శాఖాధికారులుకు సంబంధముందని, జిల్లా స్థాయి అధికారుల నుండి గ్రామస్థాయి అధికారులు పాల్గొని ప్రభుత్వం నిర్దేశించిన అంశాలలో పూర్తి ప్రగతి సాధించేందుకు కషిచేయాలని పేర్కొన్నారు.

గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, మురుగు కాలువలలో రోడ్డుపై నిలిచిన చెత్త తొలగించి 30 రోజులలో పల్లె వాతావరణం మారే విధంగా చూడాలని అన్నారు. వర్షాలు తీవ్రంగా కురుస్తున్న పల్లెల్లో పరిసరాల పరిశుభ్రతగా ఉంటే ఏలాంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలవని చెప్పారు. గ్రామ స్థాయిలో ఆయా శాఖల ప్రభుత్వ కార్యాలయలు కూడా పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా గ్రామ సచివాలయం అంగన్‌వాడి పాఠశాల, పశు వైద్యశాల, సబ్‌ సెంటర్‌ సంబంధించిన ప్రభుత్వ భవనాలలో కూడా పరిశుభ్ర ఉండాలని చెప్పారు.

కార్యక్రమం కోసం మండల స్థాయి గ్రామపంచాయతీ స్థాయి నియమించిన స్పెషల్‌ అధికారులు శాఖాపరమైన పనులను పెండింగ్‌ పెట్టకుండా కార్యక్రమంలో కూడా తప్పనిసరిగా పాల్గొని చేయవలసిన పనులను మిషన్‌ మోడ్‌లో పూర్తిచేయాలని సూచించారు. 30 రోజుల తర్వాత పల్లెల రూపురేఖలు మారిపోయే విధంగా తమ వంతు బాధ్యతలు నెరవేర్చుకోవాలని చెప్పారు.

ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. 30 రోజుల తర్వాత రాష్ట్రం నుండి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు జిల్లాలో పర్యటించి పరిశీలన చేస్తారని, ఈ సందర్భంలో ఎలాంటి రిమార్క్‌ రాకుండా చూడాలని జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులను కూడా భాగస్వాములు చేయాలని ఆన్నారు. గ్రామీణ ప్రాంతంలో కాకుండా జిల్లాలోని మున్సిపాలిటీలలో నగర పాలక సంస్థలో కూడా పరిశుభ్రత, పచ్చదనం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా పచ్చదనం పరిశుభ్రతతో వెల్లివిరియాలని కలెక్టర్‌ అన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డిఆర్‌ఓ ఆర్‌ అంజయ్య, డిఆర్‌డిఓ రాథోడ్‌ రమేష్‌, ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, నగరపాలక కమిషనర్‌ జాన్‌ సంసన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *