Breaking News

తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు అంటూ తన రచనలతో తెలంగాణ కాంక్షను రగిలించిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సోమవారం కామారెడ్డి మండల కార్యాలయంలో కాళోజీ నారాయణ రావు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో కామారెడ్డి మండల అధ్యక్షులు పిప్పిరి అంజన్న, మండల వైస్‌ ఎంపీపీ ఉరుదొండ నరేష్‌ కుమార్‌, ఎంపీడీవో నాగేశ్వర రావు, ఎంపీటీసీ సభ్యురాలు నిమ్మ జలజ, కమ్మరి అనంతలక్ష్మి, కోరంద భాగ్యలక్ష్మి, భీమయాల నీలవ్వ, కో ఆప్షన్‌ సభ్యులు మమ్మద్‌ ఫజిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *