Breaking News

బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు కాళోజీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయులు కాళోజి నారాయణ రావు అని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శ్లాఘించారు. కాలోజి నారాయణరావు 106వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో జిల్లా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ఆయన పడ్డ శ్రమ చేసిన కషి ఉద్యమం ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ప్రజల కోసం ఆయన ప్రజాకవి, ఉద్యమకారుడు ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారని, జైలుకు కూడా వెళ్లారన్నారు. ఉద్యమానికి సంబంధించి ఆయన ఎన్నో కవితలు, పద్యాలు, ప్రసంగాలు పుస్తకాలు, కథలు రచించారని ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి అణగారిన ప్రజల గురించి తన కలం ద్వారా జీవితమంతా పోరాటం చేశారన్నారు.

నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేసి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రజలకు జరిగే అన్యాయాలపై నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, కటువుగా స్పందిస్తూ ఆయన పాలకులపై అక్షర ఆయుధాలను సంధించారని తెలిపారు. తెలంగాణ కోసం, అణగారిన ప్రజల కోసం ఆయన జీవించినంత కాలం తన పోరాటాన్ని కొనసాగించారని, ఆయన చూపిన బాటలో ఆయన నడిచిన మార్గంలో ఆదర్శంగా తీసుకొని అవినీతికి తావు లేకుండా ముందుకు వెళ్ళడమే ఆయనకు మనం అర్పించే ఘనమైన నివాళి అవుతుందని కలెక్టర్‌ తెలిపారు.

కేవలం జయంతి రోజున మాత్రమే కాకుండా ఎప్పుడు కూడా ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన ఏం కోరుకున్నారో దానిని సాధించడానికి మనం కషి చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ తో కలిసి కూడ ఉద్యమం చేశారన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1992లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందించిందని తెలిపారు.

అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతప్తి అని, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి అని, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని గర్వంగా ప్రకటించిన ఉద్యమ నేత, ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కలెక్టర్‌ ప్రస్తుతించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, రెవిన్యూ డివిజనల్‌ అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌, సమాచార శాఖ ఉపసంచాలకులు ముర్తుజా, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *