Breaking News

పీహెచ్‌సిలు పొగాకు రహిత ప్రాంతాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పొగాకు రహిత అంతగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. సోమవారం రాత్రి తన చాంబర్‌లో వైద్యశాఖ అధికారులతో కలిసి ఇందుకు సంబంధించిన సైన్‌ బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జాతీయ అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా జాతీయ పొగాకు మరియు ఉత్పత్తుల నివారణలో భాగంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పొగాకు వాడకాన్ని నిషేధిస్తూ ఉన్నట్టు బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రాంతాల్లో పొగతాగడాన్ని నేరంగా పరిగణించడం జరుగుతుందని ఎవరైనా పొగ తాగితే జిల్లాస్థాయి స్క్వాడ్‌ కమిటీ వారికి కనీసం 200 రూపాయల జరిమానా విధిస్తామని కలెక్టర్‌ వివరించారు. పొగ తాగడం సంబంధిత వ్యక్తులకే గాక పరిసరాల్లో వారికి కూడా దానివల్ల క్యాన్సర్‌ తదితర అనారోగ్య కారణాలు ఏర్పడతాయని, కావున ప్రతి ఒక్కరు కూడా పొగతాగడాన్ని ఎవరికి వారు నిషేధించుకోవాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం, ప్రోగ్రాం అధికారి సికిందర్‌ నాయక్‌, డిడి ఎం శ్రీనివాస్‌, డిహెచ్‌ ఈ వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *