Breaking News

కామారెడ్డిలో ఫిజియోథెరఫీ డే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో సోమవారం ప్రపంచ ఫిజియోథెరపీ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, డాక్టర్‌ మౌనిక మోరేకు తెలంగాణ ఆర్యవైశ్య మీడియా కో చైర్మన్‌ విశ్వనాధుల మహేష్‌ గుప్తా, మరియు మక్సుద్‌ హైమద్‌ అడ్వకేట్‌, కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య యూత్‌ అధ్యక్షులు వలిపి శెట్టి భాస్కర్‌ గుప్త సన్మానించారు.

కామారెడ్డిలోని శ్రీ సాయి ఫిజియోథెరపీ సెంటర్‌ ఓల్డ్‌ ఎన్‌ హెచ్‌ 7 రోడ్‌ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వనాధుల మహేష్‌ గుప్తా, మాక్సుద్‌ హైమద్‌, భాస్కర్‌ మాట్లాడుతూ మందులతో నయం కాని కొన్ని రకాల వ్యాధులను, ఫిజియోథెరపీ ద్వారా తగ్గించడం చాలా గొప్ప విషయమన్నారు. డాక్టర్‌ మౌనిక మాట్లాడుతూ అన్ని రోగాలు మందులతో నయం కావని, ఫిజియోథెరపీ ద్వారా చాలా వరకు నయం అవుతున్నాయన్నారు.

తనను సన్మానించినందుకు కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సూర్యప్రసాద్‌ అడ్వకేట్‌, రషీద్‌ నిస్సి సాంసంన్‌, హాస్పిటల్‌ అసిస్టెంట్‌ నవీన్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *