Breaking News

బాలలపై లైంగిక దాడులు అరికట్టాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలలపై జరిగే లైంగిక వేధింపులు లైంగిక దాడులు అశ్లీలత ప్రదర్శన అరికట్టుట అందరిపై బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం ప్రగతి భవన్‌లో బాలికల విద్య సాధికారిక జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్య్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ బాలబాలికల సాధికారత క్లబ్బులు ఏర్పాటుచేసి లైంగిక వేధింపుల నిరోధక చర్యలపై అవగాహన కల్పించాలని, సంఘటన జరిగిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో 34 పాఠశాలలను గుర్తించడం జరిగిందని, అందులో 25 కస్తూరిబా బాలికల పాఠశాలను 9 ఇతర పాఠశాలలో గుర్తించడం జరిగిందని, ఈ పాఠశాలలో ఆ పరిధిలో ఉన్న పోలీస్‌ అధికారులు వైద్య సిబ్బంది, ఐసిడిఎస్‌ అధికారులు లైంగిక వేధింపులు దాడులు, అశ్లీలతపై అవగాహన, నిరోధక చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాలలపై జరిగే లైంగిక దాడులు వేధింపులు, అశ్లీల చిత్రాలు చూపించడం ప్రదర్శించ చేయడం నేరమని బాలల సంరక్షణ వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిదని, మన పరిసరాలలో చాలా పరిధిలో బాలలపై లైంగిక వేధింపుల సమాచారం తప్పకుండా సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు.

అట్టి సమాచారం గోప్యంగా ఉంచినా నేరంగా పరిగణించబడుతుందని చెప్పారు. సంఘటనలు జరిగినప్పుడు విద్యాశాఖకు సంబంధించిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800-425-3525 కు గాని, పోలీస్‌ శాఖ 100 నంబర్‌ కానీ సఖి కాల్‌ సెంటర్‌ 181కు గాని, 1098 చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌కు సమాచారం ఇవ్వవచ్చునని చెప్పారు. బాలలపై లైంగిక నేరాలు జరగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పోలీస్‌ ఎక్సైజ్‌, రవాణా, మహిళా శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ వైద్య ఆరోగ్య శాఖ ఆయా బాలికల సంక్షేమ కమిటీలు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ముఖ్యంగా బస్టాండు, ఆటో, వ్యాపార కూడలి, వాణిజ్య ప్రదేశాల వద్ద, బాలికలపై వేధింపులు నిరోధించడానికి పోలీస్‌ రవాణా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గుర్తించిన పాఠశాలల పరిధిలోగల ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యాధికారి, అదేవిధంగా పోలీస్‌ అధికారులు నియమించాలని చెప్పారు.

గుర్తించిన అక్టోబర్‌ 3 నుండి 20 మార్చి వరకు బాలికల విద్య సాధికారిక క్లబ్బుల సమావేశాలను నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డిఆర్‌ఓ అంజయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *