Breaking News

రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డయేరియా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి పిల్లలకు వేసే రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ప్రారంభించారు. సోమవారం వినాయక్‌ నగర్‌ నగర్‌లోని పట్టణ ప్రాథమిక కేంద్రంలో పిల్లలకు వ్యాక్సిన్‌ను చుక్కల రూపంలో వేసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ 6 వారాల వయసున్న పిల్లలకు వ్యాక్సిన్‌ను మొదటి డోస్‌గా ప్రారంభించి తర్వాత 10వ, 14వ వారం వయసులో రెండవ, మూడవ డోస్‌లుగా వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలోని సుమారు 27 వేల మంది పిల్లలకు వ్యాక్సిన్‌ వేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.

అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో, ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచి అర్హులైన పిల్లలందరికీ వ్యాక్సిన్‌ అందించాలని తద్వారా జిల్లాలో పిల్లలకు డయేరియా వ్యాధి వ్యాపించకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకున్నట్లు అవుతుందని ఆయన తెలిపారు. వ్యాక్సిన్‌ వేయడంపై సంబంధిత సిబ్బందికి అవసరమైన అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వోలు తుకారం రాథోడ్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి శివశంకర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *