Breaking News

Daily Archives: September 10, 2019

జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలలో ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థుల ప్రతిభ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ క్రీడా పోటీలలో ఎల్లారెడ్డి గురుకులానికి చెందిన 8 మంది పాల్గొనగా ఇద్దరు విద్యార్ధులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ జిల్లా సంక్షేమ పాఠశాలల కన్వీనర్‌ జి. మహేందర్‌ తెలిపారు. అండర్‌ 19 హ్యాండ్‌బాల్‌ పోటీలలో ప్రథమ స్థానం సంపాదించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని అన్నారు. ఇదిలా ఉండగా దోమకొండ సంక్షేమ గురుకుల పాఠశాలలో 8న జరిగిన జిల్లా స్థాయి ...

Read More »

30 రోజుల ప్రణాళికతో గాంధీజి కలలుగన్న గ్రామస్వరాజ్యం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రతి గ్రామపంచాయతీ పోటీతత్వంతో పనిచేసి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు పరచాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలం నెల్లుట్ల గ్రామంలో జరిగిన 30 రోజుల కార్యాచరణ గ్రామ సభలో జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన పనుల గురించి మండల అభివద్ధి అధికారి వెంకటేశం వివరించారు. గ్రామానికి వైకుంఠధామం స్థలం సాంక్షన్‌ అయిందని, డంపు యార్డ్‌ స్థల సేకరణ ...

Read More »

రాశివనాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం రాశివనంలోని జిమ్‌ పార్కులో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ పరిశీలించారు. జిమ్‌ చుట్టూ పూల మొక్కలు, కదంబం, పారిజాతం మొక్కలు నాటి అందంగా ఏర్పాటు చేయాలని ఫారెస్ట్‌ అధికారులకు ఆదేశించారు. అనంతరం రాశి వనాన్ని పరిశీలించి పార్క్‌ మధ్యలో అడ్డుగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను, విద్యుత్‌ లైన్లను తీసివేయాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఇన్చార్జి కమిషనర్‌ చందర్‌ నాయక్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ ...

Read More »

ఘనంగా చాకలి ఐలమ్మ 35వ వర్దంతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద టిఆర్‌ఎస్‌ యూత్‌ పట్టణ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్‌ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ వర్దంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భానుప్రసాద్‌ మాట్లాడుతూ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆడవారిని చిన్నచూపు చూసే సమయంలో తుపాకి చేత బట్టి దొరలకి, పెత్తందారులకు వ్యతిరేకంగా, భూస్వాముల ...

Read More »

హమాలీలు ఐక్యం కావాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లాలోని ఏఐటియుసి జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.బాలరాజు హాజరై పోస్టర్లు ఆవిష్కరించారు. హమాలి లోడింగ్‌ అన్‌ లోడింగ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ మొదటి మహాసభలు సెప్టెంబర్‌ 20, 21, తేదీల్లో హైదరాబాద్‌లోని కాచిగూడ ఓయూ హోటల్‌ ఆవరణంలో, జాతీయ మహాసభ ఇందిరాపార్కు వద్ద కార్మికుల భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. హమాలి కార్మికుల జాతీయ మహాసభల పోస్టర్లను కామారెడ్డిలోని ...

Read More »

గణేశ్‌ నిమజ్జనం సందర్బంగా ముస్లింల అన్నదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా లింగాపూర్‌ గ్రామంలో ముస్లింలు అన్నదానం చేశారు. ఇలాంటి కార్యక్రమం గ్రామంలో మొదటి సారిగా నిర్వహించి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఈ సందర్భంగా గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ముస్లింలను అభినందించారు. అన్ని పండగలు ఇలాగే కలిసి మెలిసి నిర్వహించుకోవాలని కోరారు.

Read More »

నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా నిర్వహించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం లింగాయపల్లి గ్రామంలో గణేష్‌ మండపాల యువ సమాఖ్య ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. గణేష్‌ నిమజ్జన శోభాయాత్రను శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి వివాదాలు జరగకుండా చూడాలని, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా అందరూ ఒకరికొకరు సహకారం అందించుకోవాలని ర్యాలీలో భాగంగా యువతకు సూచించారు. ర్యాలీలో గ్రామ సర్పంచ్‌, యూత్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బైపాస్‌రోడ్‌లో వడ్లుర్‌ బైపాస్‌ వద్ద కారు టైర్‌ పేలి పల్టీలు కొట్టింది. సైడ్‌ రెళింగ్‌ ఉండడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు శ్రీహరి, సుశాంత్‌ రెడ్డి, గణేష్‌, బసంత్‌లు కామారెడ్డికి చెందిన వారు. కాగా వీరికి స్వల్ప గాయాలు కావడంతో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read More »

పద్మశాలి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నిక

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం అఖిల భారత పద్మశాలీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పద్మశాలీ భవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ పద్మశాలీ రాష్ట్ర యువజన సంఘం కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అవ్వరి భాస్కర్‌ను, రాష్ట్ర అధ్యక్షులుగా, గుండెటి శ్రీధర్‌ను రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, పీవీ రమణ నేతను స్టేట్‌ జనరల్‌ సెక్రెటరీగా, గంజి వంశీని ట్రెజరర్‌గా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

Read More »

సైనికులకు ఘనసన్మానం

రెంజల్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని గౌరీశంకర్‌ గణేష్‌ మండలి 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెంజల్‌ గ్రామానికి చెందిన సైనికులకు ఎంపీపీ రజినీ, జడ్పీటీసీ విజయ ముఖ్య అతిథిలుగా హాజరై ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ సరిహద్దుల్లో కాపాలా కాస్తున్న సైనికుల కషి మరువలేనిదని, వారికి సన్మాన సభను గౌరీశంకర్‌ గణేష్‌ మండలి వారు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ...

Read More »

గణేశ్‌ మండపాల వద్ద అన్నదానం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో గణపతి ఉత్సవాల సందర్బంగా పలు గణేష్‌ మండపాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా శివసాయి కూరగాయల మార్కెట్‌ ఆధ్వర్యంలో, గజానంద్‌ యూత్‌, ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో అన్నదానాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆర్మూర్‌ కూరగాయల వర్తక సంఘం ఆద్యక్షుఢు గంగన్‌ స్వామి మాట్లాడుతూ ప్రజలకు, భక్తులకు ఇదే విధంగా ఎన్నో సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్వామి, సరోజ, బాజమ్మ, భాస్కర్‌, రాజు, ...

Read More »

రజక జాతికే వన్నె తెచ్చిన మహిళ ఐలమ్మ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రజక ఐక్య వేదిక ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షుడు శంకర్‌, మండల అధ్యక్షులు సుర్బిర్యల్‌ గంగాధర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 34వ వర్థంతిని మంగళవారం ఆర్మూర్‌ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం యావత్‌ తెలంగాణ ప్రజానీకం కోసం తన జీవితాన్ని అర్పించిన గొప్ప సాహస యోధురాలు, బడుగు బలహీన వర్గాల కోసం తన కుటుంబం సైతం ...

Read More »

కాలేశ్వరం నీరు రాకతో కల నెరవేరింది

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలేశ్వరం నీరు పోచంపాడు వరద గేట్లను తాకడంతో తన కల నెరవేరిందని రాష్ట్ర ఆర్‌అండ్‌బి, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బాల్కొండ మండలం ముప్కాల్‌ వద్దగల శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్ల వరకు కాలేశ్వరం నీరు చేరుకున్నందున అక్కడ ఆయన గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలేశ్వరం నీరు శ్రీరాంసాగర్‌కు వస్తుందో అని ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపామన్నారు. నీరు ...

Read More »

కార్యరూపం దాల్చిన కార్యాచరణ

రెంజల్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బొర్గం గ్రామంలో ముప్పై రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ వాణి, ప్రత్యేకాధికారి లిఖిత పాలకవర్గ సభ్యులతో కలిసి గ్రామంలో ముళ్ళకంచెలు, మురుగు కాలువలను శుభ్రపరిచారు. గ్రామాల్లో ప్రధానంగా పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టి ఉపయోగించుకునేలా చూడాలని గ్రామంలో పర్యటించి ప్రజలకు సూచించారు. ప్రతీ ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత తీసుకున్నప్పుడే పచ్చని పల్లెల కల సాకారం అవుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అమ్రీన్‌, ...

Read More »

30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు పక్కాగా జరగాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులు పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ముప్కాల్‌ మండల కేంద్రంలో, బాల్కొండ మండలం కిసాన్‌ నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరుగుతున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించి ఎక్కడ కూడా చెత్త లేకుండా ...

Read More »