Breaking News

సైనికులకు ఘనసన్మానం

రెంజల్‌, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని గౌరీశంకర్‌ గణేష్‌ మండలి 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెంజల్‌ గ్రామానికి చెందిన సైనికులకు ఎంపీపీ రజినీ, జడ్పీటీసీ విజయ ముఖ్య అతిథిలుగా హాజరై ఘనంగా సన్మానించారు.

అనంతరం వారు మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ సరిహద్దుల్లో కాపాలా కాస్తున్న సైనికుల కషి మరువలేనిదని, వారికి సన్మాన సభను గౌరీశంకర్‌ గణేష్‌ మండలి వారు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ యోగేష్‌, ఎంఈవో గణేష్‌ రావ్‌, మాజీ ఎంపిటిసి కిషోర్‌, బీజేపీ మండల అధ్యక్షుడు మేక సంతోష్‌, గౌరీశంకర్‌, గణేష్‌ మండలి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపత్‌ ...

Comment on the article