Breaking News

కార్యరూపం దాల్చిన కార్యాచరణ

రెంజల్‌, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బొర్గం గ్రామంలో ముప్పై రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ వాణి, ప్రత్యేకాధికారి లిఖిత పాలకవర్గ సభ్యులతో కలిసి గ్రామంలో ముళ్ళకంచెలు, మురుగు కాలువలను శుభ్రపరిచారు. గ్రామాల్లో ప్రధానంగా పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టి ఉపయోగించుకునేలా చూడాలని గ్రామంలో పర్యటించి ప్రజలకు సూచించారు.

ప్రతీ ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత తీసుకున్నప్పుడే పచ్చని పల్లెల కల సాకారం అవుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అమ్రీన్‌, పాలకవర్గ సభ్యులు కార్తీక్‌, సాయరెడ్డి, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *