Breaking News

రాశివనాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం రాశివనంలోని జిమ్‌ పార్కులో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ పరిశీలించారు. జిమ్‌ చుట్టూ పూల మొక్కలు, కదంబం, పారిజాతం మొక్కలు నాటి అందంగా ఏర్పాటు చేయాలని ఫారెస్ట్‌ అధికారులకు ఆదేశించారు.

అనంతరం రాశి వనాన్ని పరిశీలించి పార్క్‌ మధ్యలో అడ్డుగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను, విద్యుత్‌ లైన్లను తీసివేయాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఇన్చార్జి కమిషనర్‌ చందర్‌ నాయక్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి విద్యాసాగర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శంకర్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌ నారాయణరెడ్డి, మాజీ జెడ్పిటిసి మధుసూదన్‌ తదితరులు ఉన్నారు.

Check Also

నిజామాబాద్‌ కార్పొరేటర్లు వీరే

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువరించారు. ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *