Breaking News

జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలలో ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థుల ప్రతిభ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ క్రీడా పోటీలలో ఎల్లారెడ్డి గురుకులానికి చెందిన 8 మంది పాల్గొనగా ఇద్దరు విద్యార్ధులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ జిల్లా సంక్షేమ పాఠశాలల కన్వీనర్‌ జి. మహేందర్‌ తెలిపారు.

అండర్‌ 19 హ్యాండ్‌బాల్‌ పోటీలలో ప్రథమ స్థానం సంపాదించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని అన్నారు. ఇదిలా ఉండగా దోమకొండ సంక్షేమ గురుకుల పాఠశాలలో 8న జరిగిన జిల్లా స్థాయి బాలుర యూత్‌ పార్లమెంట్‌ పోటీలలో ఎల్లారెడ్డి విద్యార్థులు ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు.

పెయింటింగ్‌, వ్యాసరచన పోటీలలో పాఠశాలకు చెందిన ఏ.ప్రేమదాస్‌, జె.అరుణ్‌, పాల్గొని జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారని, పోటీలు మండల విద్యాశాఖ ఎల్లారెడ్డి అద్వర్యంలో నిర్వహించారని తెలిపారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు రాజేశ్వర్‌, వ్యాయామ సంచాలకులు బి.ఆర్‌.నర్సింగరావు, పిఈటి లింగంలను ప్రిన్సిపాల్‌, జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ నవీనకుమార్‌, కాలేజ్‌ లెక్చరర్లు, ఉపాధ్యాయులు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

Check Also

మీ వెనకాల నేనుంటా

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని ఏమైనా ఇబ్బందులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *