Breaking News

30 రోజుల ప్రణాళికతో గాంధీజి కలలుగన్న గ్రామస్వరాజ్యం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రతి గ్రామపంచాయతీ పోటీతత్వంతో పనిచేసి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు పరచాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలం నెల్లుట్ల గ్రామంలో జరిగిన 30 రోజుల కార్యాచరణ గ్రామ సభలో జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన పనుల గురించి మండల అభివద్ధి అధికారి వెంకటేశం వివరించారు.

గ్రామానికి వైకుంఠధామం స్థలం సాంక్షన్‌ అయిందని, డంపు యార్డ్‌ స్థల సేకరణ పరిశీలనలో ఉందని, త్వరలోనే స్థల సేకరణ పూర్తి చేసుకొని వైకుంఠధామం, డంప్‌ యార్డ్‌ నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటికి కావలసిన ఆరు మొక్కలు, అలాగే రైతులకు కావలసిన మొక్కల వివరాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. మూడవ వారంలో శిధిలావస్థలో ఉన్న విద్యుత్‌ స్తంభాలు తీసివేసి, వేలాడుతున్న విద్యుత్‌ తీగలను తొలగించడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్‌ గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడుతూ, వెళ్ళుట్ల గ్రామం ముందు రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రం చేసి మొక్కలు నాటి కంచె ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. పారిశుద్ధ్యం, పచ్చదనం పనులు నిర్వహించుకుంటే ఎలాంటి వ్యాధులు, అంటు రోగాలు రావని, ఆరోగ్య గ్రామాలుగా విలసిల్లుతాయని అన్నారు. కొత్త పంచాయతీ రాజ్‌ యాక్ట్‌ ప్రకారం గ్రామాలలో డంపు సైట్‌, వైకుంఠధామం, నర్సరీ ఏర్పాటు తప్పనిసరని, అందుకోసం ప్రతి గ్రామంలో వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఇప్పటివరకు 109 గ్రామాలలో 314 ఎకరాలు మంకీ ఫుడ్‌ కోర్ట్‌ల స్థల సేకరణ జరిగిందని, వాటిలో పండ్ల మొక్కలు పెంచడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటికి దోమలు రాకుండా ఉండేందుకు పది కష్ణ, తులసి మొక్కలు, ప్రతి ఇంటికి కరివేపాకు, వేప, నాలుగు రకాల పళ్ళ మొక్కలు ఇవ్వడం జరుగుతుందని, రైతులకు పొలం గట్ల మీద వేప, చింత, టేకు మొక్కలు అందించడం జరుగుతుందని, గ్రామాలలో అంతర్గత రోడ్ల వెంబడి పెట్రోఫామ్‌, గుల్మరా తదితర చెట్లను పెంచడం జరుగుతుందని, వీటికి అవసరమైన మొక్కలను గ్రామపంచాయతీ నర్సరీలోనే పెంచడం జరుగుతుందని తెలిపారు.

500 జనాభా దాటిన గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్రాలీ, టాంకర్‌ కలిపి ఇవ్వడం జరుగుతుందని, వీటి ద్వారా చెత్త తొలగించడం, మొక్కలకు నీరు పోయడం తదితర పనులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామానికి కావాల్సిన వసతులపై సంవత్సరం, ఐదు సంవత్సరాల యాక్షన్‌ ప్లాన్‌ గ్రామ సభలో తీర్మానం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రతిభ కనబరిచిన ప్రతి మండలంలో మూడు గ్రామాలకు ప్రధమ, ద్వితీయ, తతీయ బహుమతి కింద లక్ష రూపాయలు బహుమతిగా వచ్చే గణతంత్ర దినోత్సవం నాడు అందించడం జరుగుతుందని తెలిపారు.

ఇప్పటివరకు జిల్లాలోని 526 గ్రామాలకు సంబంధించి 1316 కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్ళ కంప, జిల్లేడు, పిచ్చి మొక్కలు తొలగించడం జరిగిందని, మురికి కాలువలలో 328 కిలోమీటర్ల మేర పూడిక తీయడం జరిగిందని, 50 శాతం శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, 455 గుంతలను పూడ్చడం, 33 శిథిలాలను తొలగించడం జరిగిందని తెలిపారు. హరిత హారంలో జిల్లాలో రెండు కోట్ల 88 లక్షల మొక్కలు నాటే లక్ష్యానికి గాను ఇప్పటి వరకు ఒక కోటి 30 లక్షల మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు.

నర్సరీలలో గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం రైతులకు సంబంధించి మాట్లాడుతూ, జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యూరియా పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు 34,731 మెట్రిక్‌ టన్నుల యూరియాను పంపిణీ చేయడం జరిగిందని, జిల్లాలో 48 కేంద్రాల ద్వారా పంపిణీ జరుగుతున్నదని, పంపిణీ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.

కార్యక్రమంలో ఆర్డిఓ దేవేందర్‌ రెడ్డి, డివిజనల్‌ పంచాయతీ అధికారి రాజేంద్ర కుమార్‌, ఎంపీపీ మాధవి, గ్రామ సర్పంచ్‌ రాజేశ్వరి, ఎంపీటీసీ లక్ష్మి, ఎంపీడీవో ప్రకాష్‌, మండల ఇన్చార్జి అధికారి శ్రీకాంత్‌, పంచాయతీ సెక్రెటరీ అశోక్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *