Breaking News

ఘనంగా చాకలి ఐలమ్మ 35వ వర్దంతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద టిఆర్‌ఎస్‌ యూత్‌ పట్టణ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్‌ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ వర్దంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా భానుప్రసాద్‌ మాట్లాడుతూ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆడవారిని చిన్నచూపు చూసే సమయంలో తుపాకి చేత బట్టి దొరలకి, పెత్తందారులకు వ్యతిరేకంగా, భూస్వాముల నడ్డివిరిచిన ఘనత చాకలి ఐలమ్మకు దక్కుతుందన్నారు. భూస్వాములని ఎదురించి పేదవారికి భూములు ఇప్పించిన ఘనత చాకలి ఐలమ్మదేనన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుద పొరాట యోదురాలు చాకలి ఐలమ్మ అన్నారు. కార్యక్రమంలో తెరాస యూత్‌ పట్టణ ఉపాధ్యక్షుడు అరిచిత్‌ గౌడ్‌, సతీశ్‌, భాస్కర్‌ చారి, శేఖర్‌, భరత్‌, అక్తర్‌, సాయి కిరణ్‌, మహేందర్‌, నవీన్‌ తదితరులున్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *