Breaking News

హమాలీలు ఐక్యం కావాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లాలోని ఏఐటియుసి జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.బాలరాజు హాజరై పోస్టర్లు ఆవిష్కరించారు. హమాలి లోడింగ్‌ అన్‌ లోడింగ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ మొదటి మహాసభలు సెప్టెంబర్‌ 20, 21, తేదీల్లో హైదరాబాద్‌లోని కాచిగూడ ఓయూ హోటల్‌ ఆవరణంలో, జాతీయ మహాసభ ఇందిరాపార్కు వద్ద కార్మికుల భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు.

హమాలి కార్మికుల జాతీయ మహాసభల పోస్టర్లను కామారెడ్డిలోని ఏఐటియుసి కార్యాలయంలో ట్రాన్స్‌పోర్టు హమాలి కార్మికుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిజెపి, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులకు కార్మికుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోక పోవడం సిగ్గుచేటన్నారు. లోడింగ్‌ అన్‌ లోడింగ్‌ కార్మికులకు చట్టపరమైన సంక్షేమ సౌకర్యాలు అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.

50 సంవత్సరాలు నిండిన హమాలి కార్మికులకు నెలకు మూడు వేల పెన్షన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఉన్న అన్ని హమాలీ ప్రదేశాలను ఐక్యం చేయడానికి సెప్టెంబర్‌ 21న హైదరాబాద్‌ వేదిక కానుందన్నారు. హమాలి కార్మికులు ఐక్యంగా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు రాజు, ఎల్‌.దశరథ్‌, నాయకులు చంద్రం, శ్రీను సాయిలు, భూమయ్య, పెద్దాయ, అశోక్‌, శ్రీనివాస్‌, కష్ణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రశాంతంగా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌కు మేయర్‌గా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన దండు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *