Breaking News

రజక జాతికే వన్నె తెచ్చిన మహిళ ఐలమ్మ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రజక ఐక్య వేదిక ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షుడు శంకర్‌, మండల అధ్యక్షులు సుర్బిర్యల్‌ గంగాధర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 34వ వర్థంతిని మంగళవారం ఆర్మూర్‌ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.

ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం యావత్‌ తెలంగాణ ప్రజానీకం కోసం తన జీవితాన్ని అర్పించిన గొప్ప సాహస యోధురాలు, బడుగు బలహీన వర్గాల కోసం తన కుటుంబం సైతం ప్రాణాలర్పించి రజక జాతికే వన్నే తెచ్చిన మహిళ ఐలమ్మ తల్లి అన్నారు.

ఆమెను స్మరిస్తూ ఆమె ఆశయాలకు అనుగుణంగా, ఆమె స్ఫూర్తితో, రజకుల సమస్యల పరిష్కారానికై హక్కుల సాధనకోసం అలుపెరుగని పోరాటాలు చేయాలన్నారు. యావత్‌ రజక జాతి ఇందుకు సిద్దంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాద్యక్షులు ధర్మపాల్‌, ప్రధాన కార్యదర్శి నరేశ్‌, సభ్యులు మీర శ్రవణ్‌, మీర నాని, చేగంటి శ్రీనివాస్‌, మీర హన్మంత్‌ చౌదరి అశొక్‌, సభ్యులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *