Breaking News

నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా నిర్వహించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం లింగాయపల్లి గ్రామంలో గణేష్‌ మండపాల యువ సమాఖ్య ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. గణేష్‌ నిమజ్జన శోభాయాత్రను శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి వివాదాలు జరగకుండా చూడాలని, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా అందరూ ఒకరికొకరు సహకారం అందించుకోవాలని ర్యాలీలో భాగంగా యువతకు సూచించారు. ర్యాలీలో గ్రామ సర్పంచ్‌, యూత్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *